Case filed on salman khan and saif ali khan

salman khan, salman khan wiki, salman khan photos, salman khan body, salman khan news, salman khan family, salman khan latest movies, salman khan upcoming movies, salman khan photos, saif ali khan, saif ali khan wiki, saif ali khan news, saif ali khan marriage, saif ali khan karina kapoor love, saif ali khan love, saif ali khan latest movies, saif ali khan news, saif ali khan family, movie news, tollywood, bollywood, banjarahills, banjarahills police station

case filed on bollywood actors salman khan and saif ali khan in banjarahills police station : third aditional metropoliton court orders to file case on saif ali khan and salman khan for hurting a religion people feelings by wearing some kind of clothes

బాంబేలో బట్టలేసుకుంటే బంజారాహిల్స్ లో కేసు

Posted: 10/09/2014 02:58 PM IST
Case filed on salman khan and saif ali khan

బాలీవుడ్ ప్రముఖ నటులు సైఫ్ అలీఖాన్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ పై బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో వీరిద్దరూ బట్టలేసుకుని కండలు చూపించారు. ఫొటోలకు కూడా బాగానే ఫోజిచ్చారు. అయితే ఇప్పుడదే ఫ్యాషన్ షో వీరిద్దరికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఫ్యాషన్ షోలో వీరిద్దరూ వేసుకున్న బట్టలు ఓ మతం మనోభావాలను అవమానించేలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై మొఘల్ పురాకు చెందిన ఫసియుద్దీన్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

ఈ పిటిషన్ విచారించిన మూడవ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ర్టేట్ కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలిసులను ఆదేశించారు. కోర్టు ఆదేశాల ప్రకారం సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ పై ఐపీసీ సెక్షన్ 295(ఎ) ప్రకారం కేసులు నమోదు చేశారు. త్వరలోనే ఈ కేసుపై చార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేస్తామని బంజారాహిల్స్ పోలిసులు తెలిపారు. మామూలుగా అయితే హీరోయిన్లు ఒంటిపై నూలుపోగులు ఉంచుకోవటానికి ఇబ్బందిపడుతుంటే.., మన హీరోలు మాత్రం దర్జాగా బట్టలు వేసుకుని బయటకు వచ్చారు. అయితే వీరిపై ఇప్పుడిలా కేసులు వచ్చి పడ్డాయి.

ఐపీసీ సెక్షన్ 295(ఎ) అంటే ఒక మతం, వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించటం. అది మాటల ద్వారా కావచ్చు లేదా చేతి వ్రాతల వల్ల లేదా వ్యక్తుల ప్రవర్తన వల్ల కూడా అయి ఉండవచ్చు. అంటే బయటకు కన్పించేలా ఏ విధంగా అవమానించినా అది చట్టరిత్యా నేరం. ఇక ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదైతే గరిష్టంగా నాలుగు సంవత్సరాల జైలు శిక్ష లేదా ఫైన్ విధించవచ్చు. లేదా ఫైన్, శిక్ష కలిపి విధించవచ్చు. అయితే దీనికి బెయిల్ పొందే అవకాశం ఉంది. వాస్తవానికి వీరిద్దరూ కావాలని ఒక మతంను కించపర్చే ఉద్దేశ్యంతో అలా చేసి ఉండరు. కాని నాకు చట్టం తెలియదు అనటం శిక్షకు మినహాయింపు కాదు కాబట్టి కేసు ఎదుర్కోక తప్పదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  saif ali khan  bollywood  banjarahills  

Other Articles