Adah sharma on allu arjun latest movie

allu arjun, allu arjun movies, allu arjun wiki, allu arjun latest movies, allu arjun marriage, allu arjun upcoming movies, allu arjun son, allu arjun trivikram srinivas movies, ram charan tej, mega family, megafamily fans, mega star fans, allu arjun fans, adah sharma, adah sharma wiki, adah sharma movies, adah sharma latest updates, adah sharma gossips, adah sharma latest hot photos, adah sharma hot photos, trivikram srinivas, latest news, tollywood latest updates, telugu latest news, crazy, crazy things, crazy images, crazy news

actress adah sharma doing heroine role in allu arjun latest movie directing by trivikram srinivas : adah sharma says about her role in latest movie with allu arjun that she played a crazy character in the movie

అదా క్రేజీ అందాలకు ఫన్ని బన్ని ఫిదా

Posted: 10/09/2014 01:54 PM IST
Adah sharma on allu arjun latest movie

‘సెలవనుకో ఇక ఏడవకే మనసా’ అంటూ అభిమానులకు ‘హార్ట్ ఎటాక్’ ఇచ్చిన అదా శర్మ తన కొత్త సినిమా గురించి కొన్ని ముచట్లు చెప్పింది. తెలుగులో రెండవ సినిమా.., బన్నీతో చేస్తున్న మొదటి సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పింది. ఇక పేరు ప్రకటించని ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా క్రేజీగా ఉంటుందని అంటోంది. అంతేకాదు చాలా ఫన్నీగా కూడా ఉంటుందట. తొలి సినిమాలో అందర్ని ఎమోషనల్ అయ్యేలా చేసినా.. ఈ సినిమాతో మాత్రం తెగ నవ్వించేస్తాను అని చెప్తోంది. తన క్యారెక్టర్ తెగనచ్చేస్తుంది మీ అందరికి అని ఇప్పుడే సంబరపడిపోతుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కూడా యాక్షన్ ప్లస్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది అని ఫిలింనగర్ లో టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో కామెడికి మాత్రం కొదువ ఉండదు అంటున్నారంతా. ఇక పంచు డైలాగులు అయితే పడుతూనే ఉంటాయని సినిమా గురించి తెలిసిన వారు చెప్తున్నారు. షూటింగ్ లో అదా ఈ మద్యే జాయిన్ అయిందని తెలుస్తోంది.

అదాతో పాటు సమంత, ప్రణిత కూడా కొత్త సినిమాలో హీరోయిన్లుగా తెరపై కన్పించనున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు పోయి.., ఒకే సినిమాకు ముగ్గురు హీరోయిన్లు అనే సామెత వచ్చినట్లుగా పాపులర్ పాపలంతా బన్నీ పక్కన చేరటంతో అసలు మ్యాటర్ ఏమిటి అని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ముగ్గురితో త్రివిక్రమ్ ఏదో మాయ చేసే ఉంటాడు అనుకుంటున్నారు. హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీ అందిస్తుండగా.., ‘జులాయి’ నిర్మాత రాధాకృష్ణ ప్రొడ్యుసర్ గా ఉన్నాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : adah sharma  allu arjun  trivikram srinivas  latest news  

Other Articles