Bahubali comic con on 10th october

bahubali, bahubali latest, bahubali news, bahubali gossips, bahubali images, bahubali photos, bahubali news, bahubali comic con, bahubali release date, bahubali songs, bahubali prabhas stills, prabhas, prabhas images, prabhas latest photos, prabhas news, rajamouli, ss rajamouli

bahubali coming as comic con from 10th october to 12th october at hitex exhibition centre : director rajamouli says his latet movie bahubali coming as comic con in twodays

రెండ్రోజుల్లో బాహుబలి బయటకు వస్తున్నాడు

Posted: 10/08/2014 11:47 AM IST
Bahubali comic con on 10th october

ప్రభాస్ కొత్త సినిమా ‘బాహుబలి’ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని అంతా ఎదురుచూస్తుండగా... చెప్పా పెట్టకుండా రెండ్రోజుల్లో బయటకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. అయితే ఇది కేవలం కామిక్ కాన్ గా మాత్రమే. సినిమాలను ఎంత తెలివిగా తెరకెక్కిస్తాడో... పబ్లిసిటిలోనూ అంతే నైపుణ్యం ప్రదర్శించటం మన జక్కన్నకు తెలిసిన విద్య. అందులో భాగంగానే కామిక్ కాన్ గా బాహుబలిని తీసుకువస్తున్నారు. హైదరాబాద్ లో మూడ్రోజుల పాటు జరిగే కామిక్ కాన్ షో లో పిల్లలు, పెద్దలను అలరించేందుకు బాహుబలి వచ్చేస్తున్నాడు.

కామిక్ కాన్ అంటే సరదా కోసం పెట్టే కార్యక్రమం ఇందులో గేమ్స్, ఈవెంట్స్ ఇలా పలు రకాల వినోదభరితమైన కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఏటా ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుని కాన్స్ నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ సారి ‘బాహుబలి’ కాన్సెప్ట్ గా కామిక్ కాన్ నిర్వహిస్తున్నారు. అంటే ఈ కాంపిటిషన్ లో పాల్గొనేవారు బాహుబలిలా వేషం వేసుకుని రావాలి. అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఈ కామిక్ షో జరగనుంది. కామిక్ కాన్ కాన్సెప్ట్ ‘బాహుబలి’వైపు మళ్ళేందుకు రాజమౌళి కీలకంగా వ్యవహరించాడు అని తెలుస్తోంది.

ఇందుకు కారణం ఏమిటంటే.., ఈ సినిమా విడుదల ఇప్పట్లో లేదు. 2015లో అని ముందుగానే ప్రకటించారు. అప్పటివరకు సినిమా పేరు జనాలకు గుర్తుండిపోవటంతో పాటు.., వారి నోళ్ళలో ఆడుతుండాలి అంటే ఏదో ఒక కార్యక్రమం నిర్వహించక తప్పదు. అందుకే ఈ ఇలా వెరైటిగా ప్లాన్ చేశాడు జక్కన్న. దీని వల్ల చిన్న పిల్లలకు కూడా ఈ సినిమా గురించి క్రేజ్ ఏర్పడుతుంది. అంతేకాదు పిల్లల వెంట ఎలాగు తల్లితండ్రులు వస్తారు కాబట్టి వారికి కూడా సినిమాపై కాస్త ఆసక్తి ఏర్పడుతుంది అని ప్లాన్ చేశాడన్నమాట. ఇప్పటికే ‘బాహుబలి’ టీంతో క్రికెట్ మ్యాచ్ ప్లాన్ చేయగా.., తాజాగా ఇలా కామిక్ కాన్ ప్రయోగం చేస్తున్నాడు.

దీనికి సంబంధించిన అప్ డేట్స్ ఫేస్ బుక్ లోని బాహుబలి పేజ్ లో అందుబాటులో ఉంటాయన్నారు. అదే విధంగా.., పోటిల గురించి బాహుబలి కామిక్ కాన్ పేజిని చూడాలని చెప్పారు. మొత్తానికి సినిమా పేరును ఎవరూ మర్చిపోకుండా జక్కన్న ఎప్పటికప్పుడు క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నారు. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో.., రానా విలన్ క్యారెక్టర్ పోషించారు. ఇక తమన్నాది లీడ్ హీరోయిన్ క్యారెక్టర్. భారీ బడ్జెట్, భారీ సమయం తీసుకుని మరీ తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తవుతుందని సినిమా యూనిట్ వర్గాలు అంటున్నాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bahubali  comic con  rajamouli  prabhas  

Other Articles