Ntr new movie first look to release for diwali

ntr, ntr movies, ntr latest movie, ntr upcoming movies, ntr movie stills, ntr movie news, ntr puri jagannath movie, ntr movie latest photos, ntr marriage, ntr son, tollywood, latest news, film news, gossips, telugu news, puri jagannath, bandla ganesh

junior ntr latest movie of puri jagannath getting ready to release for diwali : ntr getting ready to give diwali gift for his fans with new movie first look poster

ఫ్యాన్స్ కు దీపావళి కానుక ఇదే.. !

Posted: 10/08/2014 11:19 AM IST
Ntr new movie first look to release for diwali

అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ దీపావళి కానుకను ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రేక్షకుల కోసం తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ ను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు. పూరీ డైరెక్షన్ లో వస్తున్న కొత్త సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే సినిమాపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. చాలాకాలం తర్వాత పూరితో ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. దీంతో ఫ్యాన్స్ కోసం దీపావళి కానుకగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఫస్ట్ లుక్ అందరికి నచ్చేవిధంగా ఉండేట్లు డిజైన్ చేస్తున్నారు. జూనియర్ స్టిల్ తో పాటు వీలయితే టైటిల్ పెట్టే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం తారక్ ఫొటోను విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పలు స్టిల్స్ సేకరించి పెట్టారట కూడా. ఈ సినిమాకు ‘నేనోరకం’ అనే టైటిల్ పెడుతున్నట్లు ఊహాగానాలు వచ్చినా వాటిని గతంలో పూరి జగన్నాధ్ తోసిపుచ్చారు. బండ్లగణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘బాద్ షా’ తర్వాత కాజల్ తో ఎన్టీఆర్ కలిసి తీస్తున్న సినిమా ఇదే.

డిసెంబర్ చివరి వారంలో లేదా.., సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలు వరుసగా షాక్ ఇస్తుండటతో అప్రమత్తమైన ఎన్టీఆర్ కధల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన సూచన మేరకు స్క్రిప్టులో కొన్ని మార్పులు కూడా చేశారు. అంతేకాకుండా ఖర్చు కూడా జాగ్రత్తగా చూసి పెట్టమని నిర్మాతలకు సూచించాడు. పోలిస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో వస్తున్న ఎన్టీఆర్ సినిమాపై ఫ్యాన్స్ అయితే చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వరుసగా వస్తున్న పోలిస్ కధలు అంతగా ఆడటంలేదు. ఈ సమయంలో వస్తున్న మరో పోలిస్ ను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.

కార్తిక్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ntr  puri jagannath  first look  latest news  

Other Articles