Neha dhupia slams famous singer jesudas remarks against girls wearing jeans

neha dhupia, neha dhupia hot photo shoot, neha dhupia nude photo shoot, neha dhupia hot movies, neha dhupia jesudas news, neha dhupia jesudas, jesudas comments on girls dressing style

neha dhupia slams famous singer jesudas remarks against girls wearing jeans

జేసుదాస్ మీద సెటైర్లు వేసిన సెక్సీమణి!

Posted: 10/07/2014 04:13 PM IST
Neha dhupia slams famous singer jesudas remarks against girls wearing jeans

సాధారణంగా ఏ బిడ్డైనా తప్పు పనులు చేస్తుంటే తల్లిదండ్రులు అలా చేయకూడదంటూ మందిలిస్తూ వుంటారు. అదేవిధంగా ప్రముఖ గాయకుడు జేసుదాస్ కూడా ఒక మంచి ఉద్దేశ్యంతో మహిళల మేలు కోరి చెప్పిన మాటలు ఆయనకే శాపంగా మారినట్లు కనిపిస్తున్నాయి. సంస్కృతి - సంప్రదాయాలకు ప్రపంచంలోనే మారుపేరుగా నిలిచిన భారతదేశంలో మహిళలకు నిరాడంబరత, మంచితనానికి పెట్టని ఆభరణాలు. అటువంటివాళ్లు ప్రస్తుతం పాశ్చాత్యదేశాల కల్చర్ కు అలవాటుపడి జీన్స్, చిట్టిపొట్టి డ్రెస్సులు ధరిస్తున్నారు. దీనివల్ల పక్కవాళ్లను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా.. వాళ్లు కూడా ఇబ్బందుల్లో పడుతున్నారు. అలాచేయకుండా నిండువస్త్రాలను ధరిస్తే మంచిది.. అంటూ జేసుదాస్ పేర్కొన్నారు.

కానీ ఈయన చెప్పిన ఈ మాటలు మహిళలు అస్సలు నచ్చినట్లే లేదు. ఆయన చేసిన కామెంట్లు మహిళ స్వేచ్ఛను హరించినట్లుగా వున్నాయని మహిళాసంఘాలు ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అలాగే తాజాగా ఒక బాలీవుడ్ సెక్సీమణి నేహా ధూపియా కూడా ఆయన మీద ఘాటుగా కామెంట్లు చేసింది. ప్రముఖ గాయకుడు జేసుదాస్ చేసిన వ్యఖ్యాలను ఖండించిన నేహా ధూపియా.. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో, ధరించకూడదోనన్న విషయం వివాదాస్పదం కావడం చాలా దురదృష్టకరమని పేర్కొంది. అసలు లోపం వున్నది మహిళల్లో కాదు.. ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్న పురుషులు తమ మైండ్ సెట్ లో వుందని తీవ్రంగా విమర్శించింది. మన దేశజనాభాలో సగంవరకు వున్న మహిళల దుస్తులకు సంబంధించి మగవాళ్లు ఆలోచనలను సరిదిద్దాల్సిన అవసరం వుందని తెలిపింది.

డి-గ్రేడ్ సినిమాల్లో అందాల ఆరబోత, వేడెక్కించే సన్నివేశాలకు ఏమాత్రం సిగ్గులేకుండా నటించిన ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఇటువంటి వ్యాఖ్యలు చేయడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కేవలం ఈమె కాదు.. ఈమెలాంటి ఎంతోమంది తారలు - మోడల్స్ బట్టలు విప్పేసి మరీ ఇటువంటి కామెంట్లకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇతరుల సంగతేమోగానీ.. ఈమె చేస్తున్న కామెంట్ల ప్రకారం మహిళలు బజార్లో బట్టలు విప్పుకుని తిరిగితే తప్పులేదు గానీ.. వారికోసం మంచికోరి వ్యాఖ్యానాలు చేసేవాళ్లు మాత్రం తప్పన్నమాట! ఏదైతేనేం.. ఈ అమ్మడు చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : neha dhupia  singer jesudas  girls wearing jeans  women dressing style  

Other Articles