Director puri jagannath bumper offer to new movie writers

director puri jagannath, puri jagannath latest news, puri jagannath twitter news, director puri jagannath movies, movie writers, movie script writers, tollywood news, telugu movie news, telugu news, tollywood directors

director puri jagannath bumper offer to new movie writers

సినిమా రచయితలకు పూరీ బంపరాఫర్!

Posted: 10/07/2014 03:41 PM IST
Director puri jagannath bumper offer to new movie writers

సాధారణంగా ఎవ్వరికైనా తమకంటూ కొన్ని ప్రత్యేక కలలు వుంటాయి. కొంతమంది వాటిని సాకారం చేసుకోవడంలో సఫలం అవుతారు కానీ మరికొంతమందికి అవి సాధ్యం కావు. జీవితాంతం ప్రయత్నించినప్పటికీ తమ కలలను పూర్తి చేసుకోలేకపోతారు. ఇక నేటి యువతరం అయితే చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిపోదామని ఆశ పడుతుంటారు. నటీనటులుగా కాకపోయినా.. ఆ పరిశ్రమలో ఏదో ఒక విభాగంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా వుంటారు. అందులో మేకప్ మేన్, ఫ్యాషన్ డిజైనర్, స్ర్కిప్ట్ రైటర్స్ ఇలా రకరకాలుగా విభాగాలు వుంటాయి. అటువంటి విభాగాల్లో పనిచేయడానికి ఎంతోమంది చిత్రపరిశ్రమలు చుట్టూ కాలక్షేపం చేస్తూనే వుంటారు. కానీ ఇండస్ట్రీలో పనిదొరకడం అంత సులభం కాదు. నేటికాలంలో అయితే కొత్తవారికి అస్సలు అవకాశాలే దొరకవు. వారసత్వం వుంటే తప్ప.. కొత్తవాళ్లకు పరిశ్రమలో ఎంట్రీ కూడా వుండదు.

అయితే అప్పుడప్పుతు కొత్తవారికి అవకాశాలిస్తామంటూ చిత్రపరిశ్రమల నుంచి ఆఫర్లు వస్తుంటాయి. ఇదివరకే ఇటువంటి అవకాశాలు బోలెడన్ని వచ్చాయి.. అయితే అందులో కొత్తవారికి అవకాశాలు లభించాయో లేదో తెలీదుకానీ.. తాజాగా దర్శకుడు పూరీ జగన్నాథ్ మాత్రం కొత్తవారికోసం ఒక బంపరాఫర్ ను ప్రకటించాడు. అదికూడా కేవలం సినిమా రచయితలకు మాత్రమే! సినిమాల్లో రచయితలుగా రాణించాలన్న కసి, తపన వున్న యువకులతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమని పూరీ ట్విటర్ వేదికగా ప్రకటించారు. మంచి స్టోరీ ఐడియా వుంటే, వెంటనే ఒక కపేజీలో కథను సంక్షిప్తంగా రాసి.. తన మెయిల్ ఐడీకి పంపాలని ఆయన పేర్కొన్నారు. అలా పంపించిన కథల్లో ఎవరికథైనా తమకు నచ్చితే.. వెంటనే తమ ఆఫీస్ నుంచి వారికి ఫోన్ వస్తుందని ఆయన తెలిపారు. ఎంపిక చేసిన కథారచయితలతో ఆ తర్వాత తన టీం కలిసి పనిచేస్తుందని ఆయన అన్నారు.

ఇదివరకే పూరీ యూట్యూబ్ లో వచ్చిన ‘‘పెళ్లితో జరభద్రం’’ అనే వీడియోలో నటించిన యువకుడిలో మంచి టాలెంట్ వుందంటూ అతన్ని ప్రశంసించి.. తనను సంప్రదించాల్సిందిగా అతనిని కోరిన విషయం తెలిసిందే! ఆ విధంగానే కొత్తవారిలో వున్న టాలెంట్ ను ఉపయోగించుకుని, సరికొత్త మూవీ స్ర్కిప్ట్ తో చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్ లో ఆయనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. పూరీ ఇచ్చిన ఈ అవకాశంతో కొత్త రచయితలు చాలా సంతోషంగా వున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా తమ కథను పూరీకి పంపించాలనుకుంటే.. ఆయన మెయిల్ ఐడి : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. అనే మెయిల్ కి సంక్షిప్తంగా కథను రాసి, పంపించవచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles