Hollywood star arnold schwarzenegger wants to work with tamil director shankar

arnold schwarzenegger, hollywood star hero arnold schwarzenegger, arnold schwarzenegger at i movie audio launch, arnold schwarzenegger movies, i movie audio launch photos, director shankar, tamil director shankar news

hollywood star arnold schwarzenegger wants to work with tamil director shankar

శంకర్ సినిమాలో నటించాలని ఆర్నాల్డ్ ఆరాటం!

Posted: 09/16/2014 11:25 AM IST
Hollywood star arnold schwarzenegger wants to work with tamil director shankar

తమిళ ప్రముఖ దర్శకుడు కమర్షియల్ చిత్రాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే! ఇప్పటికే ఈయన తీసిన సినిమాలు ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణను పొందినవే! ఈయన తెరకెక్కించిన ‘‘శివాజీ’’ మూవీ ఇండియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తే... ‘‘రోబో’’ హాలీఖులు ప్రముఖుల్ని సైతం ఔరా! అని అనిపించే ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఈయన హాలీవుడ్ స్థాయికి చేరిపోయాడు. దీంతో ఈయనతో కలిసి ఒక్క సినిమాలో అయిన చేయాలని బాలీవుడ్ హీరోలు సైతం ఈయన వెంట పరుగులు తీస్తున్నారు. తమతో ఒక్క సినిమా అయినా చేయాల్సిందిగా రిక్వెస్ట్ లు చేసుకుంటున్నారు. ఇక తాజాగా వీరి జాబితాలోకి ఈసారి ఏకంగా హాలీవుడ్ నటుడే చేరిపోయాడు.

భారీ ప్రతిష్టాత్మక చిత్రాల్లో మాంచి యాక్షన్ ను పండించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్... ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఆరాటపడుతున్నాడు. ‘‘శంకర్ గారూ.. మీ సినిమాలో నటించే ఛాన్స్ నాక్కూడా ఇస్తారా..?’’ అంటూ వర్ధమాన నటుడిగా బహిరంగంగానే అడిగేశాడు. సోమవారం (15-09-2014) జరిగిన ‘‘ఐ’’ మూవీ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్నాల్డ్.. ఆ సందర్భంలో స్టేజీ మీద మాట్లాడుతూ.. ఇలా శంకర్ సినిమాలో తనక్కూడా నటించాలనుందని పేర్కొన్నాడు. అలాగే శంకర్ ను బాగానే పొగడ్తలతో ముంచెత్తేశాడు.

‘‘శంకర్ ఒక గ్రేట్ డైరెక్టర్. ‘‘ఐ’’ సినిమాను ఆయన ఎంతో అద్భుతంగా మలిచారు. అందులో వున్న ఎఫెక్ట్స్ బ్రహ్మాండంగా వున్నాయి. ఆ సినిమాలో తెరకెక్కించిన సన్నివేశాలు చూస్తుంటే.. శంకర్ పనితనం ఎంత గొప్పదో ఇట్టే తెలిసిపోతోంది. ఆయన దర్శకత్వంలో నాక్కూడా నటించాలని వుంది. మరి శంకర్ గారూ.. నాకు ఛాన్స్ ఇస్తారా..?’’ అంటూ నవ్వుతూ అడిగాడు ఈ టెర్మినేటర్! ఏదిఏమైనా... ఆర్నాల్డ్ లాంటి హాలీవుడ్ స్టార్ హీరో ఇలా ఒక తమిళ దర్శకుడిని పొగడ్తలతో ముంచెత్తడం నిజంగా గర్వించదగిన విషయమే! ఒకవేళ ఆర్నాల్డ్ అడిగినట్టు శంకర్ సినిమా తీస్తే మాత్రం... మన ఇండియన్ చిత్రపరిశ్రమ ఇక హాలీవుడ్ గా మారిపోయినట్టే! మరి ఆర్నాల్డ్ అడిగినట్టు శంకర్ అతని కోరికను తీరుస్తాడాడంటారా..?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arnold schwarzenegger  tamil director shankar  I movie  super star rajnikanth  

Other Articles