Rajnikanth shankar arnold schwarzenegger at i movie audio function

rajnikanth, director shankar, arnold schwarzenegger, i movie audio function, arnold schwarzenegger latest movie, rajnikanth news

rajnikanth shankar arnold schwarzenegger at i movie audio function

ముగ్గురు ‘‘సినిమా’’ లెజెండ్ లు కలిసిన వేళ!

Posted: 09/16/2014 11:02 AM IST
Rajnikanth shankar arnold schwarzenegger at i movie audio function

మన భారతీయ సినిమాజగత్తులో ఎందరో తారలు అవతారమెత్తారు. కానీ అందులో కేవలం కొంతమంది మాత్రమే తమ సత్తాను నిరూపించుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని, ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న చాలాతక్కువ మందే వున్నారు. అందులో ఒకరు సూపర్ స్టార్ రజనీకాంత్! వయసు 65 సంవత్సరాలు అయినప్పటికీ.. నేటి యువతరాలకు ధీటుగా నిలబడుతూ వారందర్నీ తలదన్నేసేలా భారీ ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూ.. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న లెజెండ్! ఈయనకు ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా జపాన్, మలేషియా, సింగపూర్ వంటి ప్రాంతాల్లో ఎందరో అభిమానులు వున్నారు.

ఇక తమిళ దర్శకుడు శంకర్... కమర్షియల్ చిత్రాలను తనదైన శైలిలో హాలీవుడ్ రేంజిలో వుండేలా తెరకెక్కించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇండియన్ పరిశ్రమలో హాలీవుడ్ దర్శకులకు ధీటుగా ఒక లెజెండ్ పుట్టాడంటూ ఈయనను అప్పుడే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు భారత్ సినీ ప్రముఖులు. అవినీతిని కేవలం ఒక్కరోజులోనే తన సినిమా ద్వారా కడిగిపారేసిన ఒకేఒక్కడు... సమాజంలో జరుగుతున్న అన్యాయాలను తుడిచేసిన అపరిచితుడు... దేశంలో వున్న నల్లధనాన్ని వెలికితీసే మార్గాన్ని కనుగొన్న శివాజీయే ఆ శంకర్!

ఇక హాలీవుడ్ చిత్రపరిశ్రమలో కండలవీరుడుగా పేరు నమోదు చేసుకున్న ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్. ఇంతవరకు ఏ హాలీవుడ్ నటుడికి దక్కని గౌరవం ఈయనకే సొంతం! సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించిన సినిమాలలో సైతం భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించి.. ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఏకైక వీరుడు! ఇప్పటివరకు ఇతను నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించినవే!

ఇలా ప్రపంచప్రఖ్యాత గాంచిన ఈ ముగ్గురు లెజెండ్ లు ఒక్కచోటే కలిస్తే ఇంకేమైనా వుంటుందా..! సోమవారం ‘‘ఐ’’ చిత్రం ఆడియో వేడుక సందర్భంగా ఈ ముగ్గురు హీరోలు ఒకేచోటే కనువిందు చేశారు. దాంతో జనాలందరూ ఒకే అరుపులు! వీరిని చూడటానికి దేశవిదేశాల నుంచి అభిమానులు తరలివచ్చారు. ఇండియన్ పరిశ్రమలో ఇంతవరకు ఎన్నడూలేని విధంగా ఘనంగా నిర్వహించిన ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన రజనీకాంత్, ఆర్నాల్డ్.. ఆ ఫంక్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ ముగ్గురి గురించి మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి.

"ఐ" మూవీ ఆడియో లాంచ్ స్టిల్స్

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arnold schwarzenegger  rajnikanth  shankar  i movie  

Other Articles