దగ్గుబాటి రాణా.. చెన్నై చిన్నది త్రిషా గురించి తెలియని వారు తెలుగు ఫిలిం ఇండస్ర్టీలో లేరు. అప్పట్లో వీరు చేతులు పట్టకుని తెగ తిరిగేశారు. అయితే ఆ విషయాలు మీడియాలో వేగంగా షికార్లుచేయటంతో తిరుగుల్లు కొంతకాలం తగ్గించారు. సరేలే లైట్ తీసుకున్నారేమో అనుకుంటుండగానే సెల్పీ పెట్టి మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తాజా ఫొటోతో వీరిద్దరూ మళ్లి రామాయణం మొదలు పెట్టారని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. అటు వీరి వ్యవహారం దగ్గరినుంచి తెలిసిన వారు ఇదంతా తమకు కొత్తేం కాదు బాబాయ్ అంటున్నారు.
వీరిద్దరూ గతంలో చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగారు. అయితే దీనిపై మీడియా ఎంత ప్రశ్నించినా ఇద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ అంతే... నిజ్జంగా ఏమి లేదు అని వివరణ ఇచ్చారు. కాని పుకార్లు మాత్రం షికార్లు చేయటంతో కాస్త తిరుగుళ్లు తగ్గించినట్లు కన్పించారు. ఈ మద్య బయట ఎక్కడా ఇద్దరూ కలిసి కన్పించటంలేదు. అయితే రహస్యంగా మాత్రం కలుసుకోవటం, కబుర్లు చెప్పుకోవటం జరుగుతున్నట్లు ఓవైపు ప్రచారమైతే జరుగుతోంది. కాని నిప్పు లేదు కదా అని ఎవరూ పొగ పెట్టలేదు. అటు కొంతమంది మాత్రం వీళ్ళు కలుసుకోవటం లేదు. విడిపోయారు అని చెప్పారు. కాని ఎవరు చెప్పేది నమ్మాలో తెలియక ఈ విషయం గురించి పట్టించుకోవటాన్ని పక్కనబెట్టేశారు.
కాని తాజాగా వచ్చిన సెల్ఫీ తిరిగి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను పక్కపక్కనే కూర్చుని ఫొటో దిగి అప్ లోడ్ చేసుకున్నారు. ఇంకేముంది మళ్లీ మొదలైంది బాబోయ్ అని అంతా అనుకుంటున్నారు. మరి ఈ సారి కూడా జస్ట్ ఫ్రెండ్సేనా..,లేక ఇంకేమైనా విషయం ఉందా వీరే చెప్పాలి. కేవలం టాలీవుడే కాదు చెన్నై భామ పుట్టినిళ్ళయిన కోలివుడ్ వర్గాలు కూడా తమ అల్లుడు అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. ఇప్పుడీ వార్తలు గుప్పుమనటానికి కారణం అయిన ఫొటో సంగతి చూస్తే.., సైమా వేడుకల కోసం ఇద్దరూ కలిసి వెళ్లారు. ఇదే సమయంలో పక్కపక్కనే కూర్చుని సెల్ఫీ తీసుకుని ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా తమకు అకౌంట్లు ఉన్న సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అదేవిధంగా ఫారిన్ ట్రిప్పులకు కూడా కలిసి వెళ్ళారు.
ఈ ఫొటోలను సినిమా వర్గాలు డౌన్లోడ్ చేసుకుని చూడండి మేం చెప్పిందే నిజమైంది వీరిద్దరూ మళ్ళీ కలిశారు అని అంటుండగా.., కలిశారు కాని అసలు విడిపోలేదే అని మళ్లీ వివాదం మొదలయింది. ఒక్కటి మాత్రం నిజం వీరిద్దరి మద్యా ఏదో ఉంది. అది స్నేహమా లేక మరొకటా అనేది వారికే తెలియాలి. నీకునువ్వు నాకు నేను అన్నట్లు కలిసి ఉంటారా లేక.., నువ్వు నేను అన్నట్లు విడివిడిగా కలిసి ఉంటారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. రంగుల ప్రపంచం కదా ఎవరు ఎప్పుడు ఏ పాత్రలో ఒదిగిపోతారో ఏమి చెప్పలేము సుమా.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more