Ram gopal varma short film with manchu laxmi

ram gopal varma, ram gopal varma movies, ram gopal varma latest news, ram gopal varma comments, latest news, manchu laxmi, manchu laxmi hot, manchu family, a day of laxmi manchu foot, latest news, tollywood news, short films, ice cream movie, ice cream2 movie, latest short films, best short films, youtube

ram gopal varma making a short film with manchu laxmi with a day of laxmi manchu foot : varma making his first short film with manchu laxmi

షార్ట్ ఫిలింలు తీసుకుంటున్న వర్మ

Posted: 09/12/2014 04:29 PM IST
Ram gopal varma short film with manchu laxmi

డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఎవరితో ఏమైనా చేయించగల నేర్పరి. తాను అనుకున్నది చూపించటం కోసం ఏమైనా చేస్తాడు. ఎంచుకున్న కద కోసం ఎన్ని పాట్లయినా పడతాడు. ఇప్పుడు వర్మ సడన్ గా సినిమాలు వదిలేసి షార్ట్ ఫిలింలు తీసకుంటున్నాడని తెలిసింది. అయితే సినిమాలు పూర్తిగా వదిలేశాడని కాదు. అలా ఓ సారి చిన్న సినిమాలో కూడా తన ప్రయోగం చేస్తున్నాడన్నమాట. మంచులక్ష్మితో కలిసి సినిమాలు మొదలు పెట్టడమే కాదు పూర్తి చేశాడు కూడా. త్వరలోనే ఆన్ లైన్ లో విడుదల చేసేందుకు సిద్దం అవుతోంది సినిమా.

మంచు లక్ష్మి జీవితంలో ఒకరోజు జరిగిన కధ గురించి ఈ సినిమా తీశారట. ఆరోజు ఆమె పాదం ఎటు వైపు అడుగులు వేసింది. ఎలాంటి పరిణామాలకు దారి తీసింది అనేది క్లుప్తంగా సినిమా కధ. దీనికి ‘ ఎ డే ఆఫ్ లక్ష్మి మంచు ఫుట్’ అని పేరు కూడా పెట్టేశారు. సినిమా అంటే భయపెట్టడమే కాకుండా.., ప్రతి దాంట్లో కెమెరాలను పెట్టి సినిమా చూపించటం వర్మ స్పెషాలిటి. ఇప్పుడు పాదం గురించి సినిమా నడుస్తుంది కాబట్టి.., కెమెరా భూమిలో పెట్టాడా.. అనే చర్చ జరుగుతోంది. అటు పెట్టినా పెట్టవచ్చు.., వర్మ కదా అని కొందరు అనుకుంటున్నారు.

షార్ట్ ఫిలిం అంటే.., సినిమాలపై ఆసక్తితో, తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సందేశాలు, సరదాల కోసం తీసుకునేవి. మరి సినిమాలతో బిజీగా భయపెడుతున్న వర్మ సడన్ గా ఎందుకు ఇటువైపు వచ్చాడు. అటు చిన్న తెరపై ప్రోగ్రాంలతో సమయం తీరికలేని లక్ష్మి ఎందుకు టైం అడ్జస్ట్ చేసుకుని మరి షార్ట్ కు ఓకే చెప్పిందనే విషయంపై వారే సమాధానం చెప్పాలి. అయితే ఏదయితేనే వర్మ ఓ షార్ట్ ఫిలిం తీస్తున్నాడు. తొలి ప్రయత్నం కావటంతో తన ప్రత్యేకతను చాటుకునేందుకు ఖచ్చితంగా గట్టి ప్రయత్నమే చేస్తాడు. ఇందులో కూడా ఏదో ఒక చిన్న టెక్నాలజి అయినా పరిచయం చేసి ఉంటాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu laxmi  ram gopal varma  short films  latest news  

Other Articles