Anushka shetty nayanatara may get chance in hollywood movie expandables action series

anushka shetty, nayanatara, neetu chandra, lakshmi roy, anushka shetty hot photos, nayanatara hot photos, neetu chandra hot photos, lakshmi roy hot photos, neetu chandra lakshmi roy, anushka shetty nayanatara, expandables movie, hollywood movies, telugu actress, tollywood news, tollywood movie news, kollywood news, kollywood actress

anushka shetty nayanatara may get chance in hollywood movie expandables action series : south indian actresses anushka shetty and nayanatara may get chance to act in hollywood action movie expandables series in which they have to expose and some action elements

హాలీవుడ్ లో అందాలు పరుస్తున్న తెలుగు భామలు!

Posted: 08/12/2014 05:38 PM IST
Anushka shetty nayanatara may get chance in hollywood movie expandables action series

ప్రస్తుతం మన సౌత్ ఇండస్ట్రీలో వున్న కొంతమంది భామలు హాలీవుడ్ లో నటిస్తున్నారనే వార్తలు జోరుగా ఊపందుకుంటున్నాయి. ఎక్కడ చూసినా ఈ వార్తలే వినిపిస్తున్నాయి. టాలీవుడ్ కి పక్కనే వున్న బాలీవుడ్ లో స్థానం పొందడానికే తైతక్కలాడుతున్న నేపథ్యంలో... ఏకంగా ఏడుసముద్రాలు దాటి హాలీవుడ్ కెళ్లి నటిస్తున్నారా..? అంటూ సినీప్రముఖులందరూ నోళ్లవెళ్లబెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ హాలీవుడ్ సినిమాలో నటించే తారలలో అనుష్క, నయనతార పేర్లు వినిపిస్తున్నాయి. వీరితోపాటు నీతూచంద్ర, లక్ష్మీరాయ్ వంటి తారల పేర్లు కూడా వున్నట్లు సమాచారం! అయితే హాలీవుడ్ లో సెక్సీ తారామణులు వున్నప్పటికీ.. మన తెలుగు అమ్మాయిలను తీసుకోవాల్సి అవసరమేముందనేగా మీ సందేహం..? అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే!

ప్రస్తుతం హాలీవుడ్ లో బ్రహ్మాండమైన యాక్షన్ తో కూడిన ఎక్స్ పాండబుల్ మూవీ నెక్ట్స్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. అందులో హాలీవుడ్ ముఖ్యనటులు సిల్వర్ స్టార్ స్టాలిన్, మెల్ గిప్సన్ లు కొంతమంది హీరోలతోపాటు ఏడుగురు హీరోయిన్లు ముఖ్యపాత్రలను ధరించనున్నారట! అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి.. ఒకే రాజ్యానికి చెందిన ఏడుగురు హీరోయిన్లను తీసుకుంటే ఆ మూవీ అంతగా ఆకర్షించుకోలేదనే భావనతో.. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ నటీమణులను ఎంపిక చేసి, తమ సినిమాలో నటింపజేయాలనే ఉద్దేశంతో యూనిట్ వర్గాలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుపుతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ తోపాటు గ్లామర్ ను భారీస్థాయిలో కనబరాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆ మూవీ యూనిట్ స్పస్టం చేస్తోంది.

ఈ నిర్ణయం ప్రకారం ఆ మూవీ యూనిట్ సభ్యులు ఏడుగురు హీరోయిన్లలో దక్షిణాదికి చెందిన ఒక నటిని తమ హాలీవుడ్ సినిమాలో నటింపజేయాలని నిర్ణయించిందట! ఈ నేపథ్యంలోనే ఎక్స్ పాండబుల్ దర్శకనిర్మాతల బృందం వచ్చే ఏడాది చెన్నైలో మకాం పెట్టి.. హీరోయిన్ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం! అలాగే ముంబైలో కూడా ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్లు తమ గ్లామర్ ను ఒలకబోయడంతోపాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించాల్సి వుంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే సౌత్ ఇండస్ట్రీలో వున్న అగ్ర కథానాయికలను ప్రత్యేకంగా పరీక్షలు పెట్టి ఎంపిక చేయనున్నట్టు సదరు యూనిట్ బృందం చెబుతోంది.

దీంతో ఈ ఎంపికలో మన సౌత్ ఇండస్ట్రీ నుంచి ముఖ్యంగా అనుష్క, నయనతారలు ఎంపికయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే వున్నాయని సమాచారాలు వస్తున్నాయి. ఎందుకంటే.. అనుష్క ‘‘అరుంధతి’’ సినిమాలో కత్తి పట్టి తన యాక్షన్ ప్రతిభను చాటుకున్న విషయం తెలిసిందే! ఇప్పుడు తాజాగా ‘‘రుద్రమదేవి, బాహుబలి’’ వంటి చిత్రాల్లోనూ ఈ అమ్మడు తన అందాలను ఒలకబోయడంతోపాటు యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తోంది. అలాగే నయనతార బిల్లా సినిమాలో బికినీ వేసుకుని మెప్పించడంతోపాటు.. ఆ సినిమాలో హీరోతో సమానంగా యాక్షన్ సన్నివేశాల్లో నటించి భేష్ అనిపించుకుంది.

ఇక వీరిద్దరితోపాటు మరో ఇద్దరు కోలీవుడ్ తారలైన  తర్వాత నీతుచంద్ర, లక్ష్మీరాయ్ వంటి తారల పేర్లూ వినిపిస్తున్నాయి. ఎందుకంటే వీరు కూడా కొన్ని యాక్షన్ తరహా చిత్రాల్లో నటించి.. తమ ప్రతిభను చాటుకున్నవారే! దీంతో ఈ నలుగురిలోనే ఎవరో ఒక భామ కచ్ఛితంగా హాలీవుడ్ సినిమాలో సెలెక్ట్ అయ్యే అవకాశాలున్నాయని... ముఖ్యంగా అనుష్క, నయనతార మధ్యే గట్టి పోటీ వుంటుందని సౌత్ ఇండస్ట్రీలో చర్చలు జోరందుకున్నాయి. మరి వీరిలో ఏ తార హాలీవుడ్ కి జంప్ అవుతుందో ఏడాదిపాటు వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles