Junior ntr fires producer bellamkonda suresh rabhasa movie postponed

junior ntr latest news, junior ntr movies, junior ntr rabhasa movie, junior ntr samantha, junior ntr pranitha, junior ntr bellamkonda suresh, junior ntr comments rabhasa, bellamkonda suresh news, samantha latest news, samantha rabhasa, pranitha latest news, pranitha rabhasa

Junior ntr fires producer bellamkonda suresh rabhasa movie postponed : tollywood junior ntr fires on rabha movie producer bellamkonda suresh for postpone the movie on august 28.

‘‘రభస’’పై రచ్చరచ్చ చేసిన జూ.ఎన్టీఆర్!

Posted: 08/06/2014 06:39 PM IST
Junior ntr fires producer bellamkonda suresh rabhasa movie postponed

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తాజాగా నటించిన చిత్రం ‘‘రభస’’! ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన రచ్చ విషయం పక్కనపెడితే... తన సినిమామీదే గరంగరంగా వున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం సినిమాను వాయిదా వేయడమే! ‘‘రభస’’ చిత్రం రిలీజ్ వాయిదా పడటంతో నిర్మాతపై ఎన్టీఆర్ చాలా కోపంగా వున్నాడని ఫిలింనగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

నిజానికి ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సి వుంది. కానీ ఈ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు హీరోగా తెరంగేట్రం చేసిన ‘‘అల్లుడు శీను’’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోందని ‘‘రభస’’ను వాయిదా వేసినట్టు కొంతమంది సినీ ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ చిందులకు ‘‘అల్లుడు శీను’’ భారీ కలెక్షన్లతో రాబడుతోందని.. ‘‘రభస’’ చిత్రాన్ని వాయిదా వేయాలని బయ్యర్లు కోరడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. దీంతో ‘‘రభస’’ విడుదల ఆగస్టు 28వ తేదీన వాయిదా పడింది.

ఇదిలావుండగా.. తమిళ సూపర్ స్టార్ సూర్య హీరోగా నటించిన ‘‘సికందర్’’ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతున్న కారణంగా నిర్మాత జాగ్రత్తపడి రభసను వాయిదా వేసినట్టు ఫిలింవర్గాలు తెలుపుతున్నాయి. వరుస ఫ్లాప్ లతో సతమతమయిన సూర్యకు ఈ సినిమా భారీ విజయాన్ని అందించేలా వుందని ప్రతిఒక్కరు భారీ అంచనాలు వేసుకున్న సంగతి తెలిసిందే! దీంతో ‘‘రభస’’ కలెక్షన్లు తగ్గిపోతాయన్న నేపథ్యంతో ఈ మూవీని వాయిదా వేసినట్టు నిర్మాత దగ్గర సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది.

అయితే.. ఈ సినిమాను వాయిదా వేయడంపై జూనియర్ ఎన్టీఆర్ నిర్మాతపై చాలా గుర్రుగా వున్నాడని ఇండస్ట్రీలో వున్నవారు చెప్పుకుంటున్నారు. తనకు తెలియజేయకుండా సినిమాను వాయిదా వేయడంతో ఎన్టీఆర్ కోపంగా వున్నాడంటూ అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో ఎన్టీఆర్ ఇకపై నిర్మాత బెల్లంకొండ సురేష్ తో సినిమాలు తీసే అవకాశాలు లేవని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై ఎన్టీఆర్, నిర్మాతలు ఎటువంటి స్పందనలు వినిపిస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles