Ntr nagarjuna multi starrer for jilla remake

ntr-nagarjuna multi starrer for jilla remake, ntr-nagarjuna multi starrer confirmed, jr.ntr and king nagarjuna movie , vijay jilla movie remake in telugu multi starrer, nagarjuna-ntr

ntr-nagarjuna multi starrer for jilla remake

వీళ్ళ మల్టీస్టారర్ కూడా రీమేకేనా ?

Posted: 07/02/2014 11:22 AM IST
Ntr nagarjuna multi starrer for jilla remake

టాలీవుడ్ లో ‘వెంకీ - మహేష్  కాంబినేషన్లో వచ్చిన  ‘సీతమ్మ వాకిట్లో  సిరిమల్లె ట్టు ’ సినిమా తరువాత  మల్టీస్టారర్  సినిమాల హవా పెరిగిపోయింది. ఈ సినిమా తరువాత ‘వెంకీ - రామ్ ’ హిందీ  ‘బోల్ బచ్చన్ ’ కి  రీమేక్ గా ‘మసాలా ’ చేశారు. ఇప్పుడు హిందీ ‘ఓ మైగాడ్ ’ సినిమాను  ‘వెంకీ - పవన్ ’ కలిసి ‘గోపాల గోపాల ’ చేస్తున్నారు. త్వరలో నాగార్జున – ఎన్టీఆర్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన రావడమే కాకుండా, దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి.

ఇప్పటి వరకు వచ్చిన ‘సీతమ్మ ’ సినిమా తప్పితే, వచ్చిన మల్టీస్టారర్ సినిమాలన్నీ హిందీ రీమేక్ సినిమాలే. మరి నాగ్ - ఎన్టీఆర్ ల చిత్రమైన స్ట్రెయిట్ తెలుగు సినిమానా అంటే కాదని తెలుస్తుంది. వీరు చేయబోయే సినిమా తమిళ స్టార్ హీరో  ‘విజయ్ ’ నటించిన  ‘జిల్లా ’ సినిమాకు రీమేక్ అని తెలుస్తుంది. తమిళంలో మోహన్ లాల్-విజయ్ కలిసి నటించారు.  ఆ సినిమాలో మోహన్ లాల్ విజయ్ ను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన దత్త తండ్రి. అయితే తెలుగులో అలానే నాగార్జున పాత్ర ఉండగా రిలేషన్ మాత్రం ఇక్కడ పెంచిన అన్నగా చూపించానున్నారని  టాక్ నడుస్తుంది. సినిమాను పీవీపీ సంస్థ నిర్మించనుంది .

ఈ మల్టీస్టారర్ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నాడు. గతంలో ఎన్టీఆర్ తో బృందావనం సినిమా చేసిన వంశీ పైడిపల్లి తొలిసారి డబ్బింగ్ స్టోరీతో మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ నుండి మొదలు కానుందట.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles