Rara krishnaiah movie gets a certificate from cencor board

RaRa Krishnaiah movie gets A certificate from cencor board, rara krishnaiah movie, rara krishnaiah movie cencor board, a certificate to rara krishnaiah movie, rara krishnaiah movie news, rara krishnaiah movie photos, sundeep kishan and regina in rara krishnaiah, sundeep kishan and regina liplock scene

RaRa Krishnaiah movie gets A certificate from cencor board

A సర్టిఫికెట్ ను ‘‘రారా’’మ్మంటున్న ‘‘కృష్ణయ్య’’

Posted: 07/01/2014 04:52 PM IST
Rara krishnaiah movie gets a certificate from cencor board

(Image source from: RaRa Krishnaiah movie gets A certificate from cencor board )

ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకంటే అతి తక్కువ ఖర్చుతో తీసిన చిన్న హీరోల సినిమాలే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ను సాధిస్తున్నాయి. గత కొద్దికాలం క్రితం రిలీజయినా చిన్న సినిమాలు... స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా నిలబడుతూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్నాయి. దాంతో దర్శకనిర్మాతలు కూడా చిన్న సినిమాలు తీయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పైగా చిన్న సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు, ఇతర యాక్టర్లందరికీ తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చుకోవాల్సి వుంటుంది. ఇది నిర్మాతలకు ప్లస్ పాయింట్ కావడంతో ఈమధ్య కాలంలో ఈ చిన్న సినిమాల హవాయే కొనసాగుతోంది.

ఈ తరహాలోనే వెంకటాద్రి సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న సందీప్ కిషన్ తాజా చిత్రం ‘‘రారా కృష్ణయ్య’’ విడుదలకు సిద్ధంగా వుంది. రొమాంటిక్, యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ పనులను కూడా ముగించుకుంది. సెన్సార్ బోర్డు అధికారులు ఈ సినిమాను వీక్షించిన తరువాత ఇందులో వున్న యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాలను దృష్టి పెట్టుకుని దీనికి ‘‘ఏ’’ సర్టిఫికెట్ ఇచ్చింది. సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో... వీరిద్దరి మధ్య ఒక లిప్ లాక్ సన్నివేశం వుందని... మధ్యమధ్యలో ఘాటు సన్నివేశాలు కూడా వున్నాయని సెన్సార్ బోర్డు అధికారులు తెలుపుతున్నారు. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా ఎక్కువ వయోలెంట్ గా వుండటంతో ఈ సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చినట్లు వారు ధృవీకరించారు.

ఈ విషయంపై హీరో సందీప్ కూడా స్పందిస్తూ... ‘‘రారా కృష్ణయ్య సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకు A సర్టిఫికెట్ తో ధృవీకరించింది. (ఇందులో వున్న లిప్ లాక్ సీన్ నాకు మంచి అనుభూతిని కలిగిందిచంది). నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను... ఎమోషనల్ తో కూడిన ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరి.. మిమ్మల్ని బాగానే అలరిస్తుంది. నా సినిమాను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ చిత్రం జూలై 4వ తేదీన మీ ముందుకు వస్తుంది. థ్యాంక్స్’’ అని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.

గతంలో సందీప్ కిషన్ - రెజీనా కలిసి నటించిన రొటీన్ లవ్ స్టోరీ డీసెంట్ హిట్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా ఈ సినిమా అదే హిట్ కాంబినేషన్ కావడంతో దర్శకనిర్మాతలు దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఇందులో జగపతిబాబు పాత్ర మరో హైలైట్ అవుతుందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పి.మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు. అలాగే అచ్చు ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles