Chiranjeevi remuneration for his 150th movie

Chiranjeevi Remuneration 150 movie, Tollywood megastar Chiranjeevi, Megastar Chiranjeevi 150th film details, Chiranjeevi 150th film heroine

Tollywood Megastar Chiranjeevi Remuneration Rs.27 crores For His 150th Movie.

అన్నయ్య... రెమ్యునరేషన్ అదిరందయ్యా ??

Posted: 06/23/2014 10:32 AM IST
Chiranjeevi remuneration for his 150th movie

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ సినిమాల్లోకి వచ్చి తన కెరియర్ లో పూర్తి చేయకుండా మిగిలిపోయిన 150 చిత్రంలో నటించేందుకు కసరత్తులు కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి స్టోరీ, దర్శకుడు, ప్రొడ్యూసర్ ఎవరు అనేది అఫీషియల్ ప్రకటన రాకున్నా ఫిలింనగర్ నుండి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి కథలు వింటూనే ఉన్నాడని, మంచి స్టోరీ చెబితే కోటి రూపాయల ఆఫర్ కూడా ఇచ్చాడని, ఈ సినిమా కోసం హీరోయిన్ గా అనుష్క పై చిరు కన్నేశాడని పుకార్లు వచ్చాయి.

ఇప్పుడు ఏకంగా ఆయన పారితోషికం ఎంత తీసుకోబోతున్నాడు ? అనే దాని పై చర్చ మొదలెట్టేశారు. ఈ సినిమా కోసం టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలు తీసుకునేదాని కంటే ఎక్కువ అంటే దాదాపు 25 కోట్లు తీసుకుంటున్నాడని అంటున్నారు. అదెలా అంటే చిరంజీవి గత సినిమాలా ఫార్ములానే పుకార్లు వచ్చాయి. ఇప్పుడు అనుసరిస్తున్నాడని, ఆయన తానెప్పుడూ పారితోషికంగా నైజాం రైట్స్ త‌న ద‌గ్గర ఉంచుకొంటాడు. ఆయన సినిమా రైట్స్ కి నైజాంలో ఇప్పుడు క‌నీసం రూ.25 కోట్లయినా ప‌లుకుతాయి. అంటే చిరు పారితోషికం రూ.25 కోట్లన్న మాట.

ఈ లెక్క నిజమైతే టాలీవుడ్ లో ఇంత మొత్తంలో పారితోషికం అందుకొనే మొదటి టాలీవుడ్ క‌థానాయ‌కుడు చిరునే అవుతాడు. మ‌హేష్‌, ప‌వ‌న్‌లు కూడా ఇప్పటి వ‌ర‌కూ రూ.18 కోట్లు దాట‌లేదు. ఇది మెగాస్టార్ రేంజ్ అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ‘ఆలు లేదు.. సూలు లేదు... కొడుకు పేరు సోమ లింగం ’ అన్నట్లు ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు ఇలాంటి వార్తల్ని వింటూ ఎంజాయ్ చేయడమే.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles