Junior artist filed complaint on ans

naga chaitanya, samantha, autonagar surya, dil raju, samantha, nagachaitanya, autonagar surya, january

Auto Nagar Surya’ movie in the AP Film Chamber saying that their remuneration is not paid till now. If the makers failed to clear these hurdles it will affect the release of the film.

ఆటోను అర్జెంటుగా ఆపేయండి

Posted: 06/22/2014 02:31 PM IST
Junior artist filed complaint on ans

నాగ చైతన్య నటించిన ‘ఆటోనగర్ సూర్య ’ నగర్ సూర్య సినిమాకు కష్టాలన్నీ తీరిపోయాయ్... ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఊపిరి పీల్చుకున్న ఆయనకు మళ్ళీ షాక్ తగిలింది. దేవా కట్టా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి విడుదల తేదీని ప్రకటించారు. కానీ ఈ సినిమాకు మళ్లీ ఇబ్బందులు వచ్చి పడ్డాయి.

జులై 10వ తేదీ వరకు చిత్రాన్ని విడుదల చేయొద్దంటూ గుంటూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చిత్ర నిర్మాణానికి తన వద్ద రూ.2కోట్లు రుణం తీసుకున్నారని, అది తీర్చకపోగా పంపిణీ హక్కులు కూడా ఇవ్వలేదని ఆరోపిస్తూ.. గుంటూరుకు చెందిన ఎంరాల్‌ ప్రాజెక్టు యజమాని మహ్మద్‌ కోర్టును ఆశ్రయించారు. ఇదే పెద్ద తలనొప్పి అని భావిస్తున్న తరుణంలో ‘మూలిగే నక్క మీద తాడిపండు ’ పడినట్లు జూ.ఆర్టిస్టుల వైపు నుంచి సైతం అడ్డంకి ఏర్పడుతోంది.

కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఫిల్మ్ ఛాంబర్ లో తమ రెమ్యునేషన్ ఇప్పటికీ ఇవ్వలేదని కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. వీరి బకాయిలు సైతం చెల్లించిన తర్వాతే విడుదల చేయాలని అంటున్నట్లు వినపడుతోంది. దీంతో ఈ సినిమా ఈనెలలో విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈ చిత్రానికి కష్టాలు తీరి విడుదలయ్యేది ఎప్పుడో కానీ, ఈ సినిమాకు బ్రేక్ ల మీద బ్రేక్ లు పడుతూ ఫుల్ పబ్లిసిటీ వస్తుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles