Govindudu andarivadele release date confirmed

Govindudu Andarivadele release date official, Ram Charan Govindudu Andari Vaadele Movie release, Govindudu Andari Vaadele release on Oct 01, Govindudu Andari Vaadele shooting, Producer bandla ganesh,

Ram Charan Govindudu Andari Vaadele Movie Release Date official announced by producer Bandla ganesh, release on October 01.

గోవిందుడు... వచ్చే వేళ ఇదే ...

Posted: 06/14/2014 01:31 PM IST
Govindudu andarivadele release date confirmed

టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో సినిమా వస్తున్న ఆ సినిమా పై కొన్ని గాలి వార్తలు రావడం వాటికి దర్శక నిర్మాతలు వివరణ ఇచ్చుకోవాల్సి రావడం. గతంలో చాలా సినిమాల పై వచ్చిన వార్తలకు వివరణ ఇచ్చుకున్న దర్శక నిర్మాతలు ఇప్పుడు మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో ‘గోవిందుడు అందరి వాడేలే ’ సినిమా విషయంలో కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

గత కొంత కాలం క్రితం ఈ సినిమా ఆగిపోయిందని, దర్శకుడి చేసిన కొన్ని సన్నివేశాలు చిరుకు నచ్చకపోవడంతో రీ షూట్ చేశారని, కొన్నింటిని తొలగించారని, ఇన్ని అవాంతరాల మధ్య ఈ సినిమా విడుదల పై పలు సందేహాలు వ్యక్తం అయ్యాయి. వీటి పై ఆ చిత్ర నిర్మాత అయిన బండ్ల గణేష్ వివరణ ఇవ్వడమే కాకుండా ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా సినిమా విడుదల తేదీనే కూడా విడుదల ముహూర్త సమయాన్ని కూడా ప్రకటించేశాడు.

ఈ రోజు ఆయన షూటింగ్ సెట్లో మాట్లాడుతూ... ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీ ఉదయం 5.45 నిమిషాలకు ఎట్టి పరిస్థితుల్లోనైనా విడుదల చేస్తామని ఖరాఖండిగా చెప్పేశాడు. మరి ఇప్పటికైనా ఈ సినిమా పై నెలకొన్నఅనుమానాల్ని తొలగించుకుంటారో లేదో చూడాలి.

కొన్ని రోజుల విరామం తరువాత ఇటీవలే ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోలో వేసిన భారీ సెట్ లో జరుపుకుంటుంటుంది. ఇందులో రామ్ చరణ్ , కాజల్ , శ్రీకాంత్, కమళిని ముఖర్జీ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles