Puri jr ntr rubabu launched on 21st

Puri-Jr.NTR Rubabu launched on 21st, Jr.NTR-Puri Jagannadh Movie Rubabu, Jr.NTR and Puri Jagannadh movie name, Vakkantham Vamsi story, Bandla Ganesh producer.

Puri is trying another film and NTR will soon be donning police uniform this time.

ఎన్టీఆర్ పొగరు చూపించబోతున్నాడు

Posted: 06/14/2014 05:11 PM IST
Puri jr ntr rubabu launched on 21st

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సభా వేధికల పై ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఎంత కూల్ గా మాట్లాడుతాడో అందరికి తెలిసిందే. వేదిక పైనే ఎంత సాఫ్ట్ గా ఉన్న ఇతను రీల్ లైఫ్ లో మాత్రం సన్నివేశాన్ని బట్టి ఎమోషనల్ సీన్స్ ని చాలా అద్బుతంగా పండిస్తాడు. మరి ఈయన్ను దగ్గరగా చూసిన వారు మాత్రం ఆయన ప్రవర్తనతో కాస్త పొగరు ఉంటుందని చెబుతాడు. ఇప్పుడు ఆ పొగరునే వెండితెర పై చూపించబోతున్నాడు.

అసలు విషయానికి వస్తే చాలా కాలం తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పొగరు బోతుగా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రానికి టైటిల్ గా ‘రుబాబు ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.  ఈ సినిమా ఈనెల 21న లాంచనంగా ప్రారంభం కానుంది. చాలా రోజుల తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం రావడంతో ఈ సినిమాతో పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలని చూస్తున్నాడు పూరీ.

అందుకోసం ఆయన క్యారెక్టర్ ని పవర్ ఫుల్ గా మలచబోతున్నాడట. పూరీకి కెరియర్ బ్రేక్ ఇచ్చిన ‘పోకిరి’ రేంజ్ లో ఈ సినిమాను చేసే ప్లాన్ ఉన్నాడు. ఎప్పుడు తన సొంత స్టోరీ, డైలాగులతో సినిమాలు తీసే పూరి తొలిసారిగా వక్కతం వంశీ అందించిన స్టోరీతో సినిమా తీస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించనున్నారు. చూద్దాం పూరీ ఎన్టీఆర్ పొగర్ని ఏవిధంగా చూపిస్తాడో ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles