Maheshwari starts fashion design business

Actress maheshwari starts fashion design business, Maheshwari launch Fashion Design Showrooms, Actress Maheshwari, launch Fashion Design Showrooms, Gulabi Actress, My Name is Mangatayaru

Actress maheshwari starts fashion design business, Maheshwari launch Fashion Design Showrooms, Actress Maheshwari, launch Fashion Design Showrooms, Gulabi Actress, My Name is Mangatayaru

‘మంగతాయారు ’ బిజినెస్ సెంటర్లు ప్రారంభించింది

Posted: 06/11/2014 12:57 PM IST
Maheshwari starts fashion design business

సినీ తారలు తనకు అనుభవం ఉన్న రంగానికి సంబంధించిన వ్యాపారాలు మొదలు పెట్టి లాభాలు గడిస్తుంటారు. యంగ్ హీరోయిన్స్ ఇలియానా లాంటి వారు ఫ్యాషన్ డిజైన్ బిజినెస్ లు పెట్టారు. ఇప్పుడు అదే బాటలో వెళుతుంది ఒకప్పుటి హీరోయిన్ మహేశ్వరి. టాలీవుడ్ జనాలకు గులాబి, పెళ్లి సినిమాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితం అయిన అందాల సుందరి మహేశ్వరి అదేనండీ మన ‘మంగతయారు ’ ఇప్పుడు వ్యాపారం ప్రారంభించింది.. టాలీవుడ్ లో సినీ అవకాశాలు తగ్గినా, తమిళంలో సినిమాలను చేసింది.

తరువాత బుల్లితెర పై ‘మంగతయారు ’ సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరిద్దామని  అతిలోక సుందరి శ్రీదేవితో ప్రచారం చేయించినా, ఆశించిన స్థాయిలో ఆదరణ రాక అట్టర్ ప్లాప్ కావడంతో సదరు టీవీ ఛానల్ వారు నిలిపివేశారు. ఇక లాభం లేదనుకొని తమిళ భాష బుల్లితెర పై ‘అదే కన్ గళ్ ’ సీరియల్ లో  కాలం గడిపేస్తుంది. దీని ద్వారా వచ్చే ఆదాయం సరిపోక పోవడంతో ఈ అమ్మడు వ్యాపారం పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంది. తనకు మొదటి నుండి  ఫ్యాషన్ డిజైన్ పై పట్టున్న మహి ఇప్పుడు ఆ బిజినెస్ నే ప్రారంభించింది. 

‘మహీ అయ్యప్పన్ ’ పేరుతో హైదరాబాద్, ముంబయ్ లో డిజైనర్ స్టోర్స్ ప్రారంభించింది. మహేశ్వరి ఆరంభించిన షోరూమ్ లో స్పెషల్ గా వధూవరులకు దుస్తులు డిజైన్ చేస్తారట. మరి ఈ మంగతాయారు బిజిసెస్ సెంటర్లకు కష్టమర్లు వచ్చేనా? మహేశ్వరి బిజినెస్ లోనైనా సక్సెస్ అయ్యేనా ? ఒకప్పుడు ‘గులాబి ’ సినిమా ద్వారా వికసించిన ఈమె మళ్లీ వికసిస్తుందా ? అనేది చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles