Pawan only 30 minutes role in gopala gopala

Pawan only 30 minutes role, Pawan Kalyan, Gopal Gopal, Pawan Kalyan 30 minutes role in Gopala Gopala, Venkatesh Shriya saran in gopal gopala, gopala gopala first look, pawan kalyan role in gopala gopala

Pawan has only 30 minutes of screen space in Gopala Gopala.

పవన్ కేవలం ముప్ఫై నిమిషాలు మాత్రమే

Posted: 06/10/2014 05:20 PM IST
Pawan only 30 minutes role in gopala gopala

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెమెరా ముందు నటించక దాదాపు సంవత్సరం అయ్యింది. ‘అత్తారింటికి దారేది ’ తరువాత ‘గబ్బర్ సింగ్ -2 ’ కి పూజా కార్యక్రమాలు జరుపుకున్నా కొన్ని కారణాలతో వాయిదా పడటం, తరువా పవన్ రాజకీయ పార్టీ పెట్టడం, సాధారణ ఎన్నికల్లో తెదేపా-భాజాపా కూటమి తరుపున ప్రచారం చేయడం, ఆ కూటమి విజయంలో కీలక పాత్రపోషించిన విషయం తెలిసిందే. రాజకీయ బిజీ నుండి రిలాక్స్ కోసం ఫారిన్ ట్రిప్ ముగించుకొని నిన్నటి నుండే మళ్ళీ కెమెరాముందుకు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

ఈయన హిందీ రీమేక్ ‘ఓ మై గాడ్ ’ రీమేక్ చిత్రం  ‘గోపాల గోపాల ’ అంటూ వెంకటేష్ తో కలిసి నటిస్తున్నాడు. కానీ వారి ఆనందం కొద్దిసేపే. ఎందుకంటే... ఈ చిత్రంలో కేవలం ముప్పై నిముషాలు పాటే కనిపిస్తాడట. కేవలం పవన్ తెర పై అర్థగంట మాత్రమే ఉంటాడని తెలియటంతో కొందరు అభిమానులు నిరాశపడుతున్నారు. క్రిష్ణుడిగా కనిపించబోయే పవన్ పాత్ర ను తెలుగు అభిమానులకు తగ్గట్లు మరికొంత సేపు పెంచితే బాగుంటుందని దర్శకులకు సలహాలు ఇస్తున్నారట.

ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దేవుడి మీద కోర్టులో కేసు వేసే పాత్రలో వెంకటేష్ నటిస్తుండగా,  హిందీలో ‘లీలాధర్ స్వామిజీ’ పాత్రలో నటించిన మిథున్ చక్రవర్తి ఈ రీమేక్ లో కూడా అదే పాత్రలో నటించనున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లలో నిర్మాతలు డి. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles