Pawan daughter aadya learns painting

Pawan Kalyan daughter Aadya painting, Renu Desai daughter Aadya, Ishq Wala Love shootings,

Aadya daughter of Pawan Kalyan and Renu Desai have been learning the painting lessons from the lead pair of Ishq Wala Love.

పవన్ కూతురు తెగ గీసేస్తుంది

Posted: 06/07/2014 05:35 PM IST
Pawan daughter aadya learns painting

కళాకారుల కుటుంబంలో పుట్టిన పిల్లలకు చిన్నప్పటి నుండే ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదించాలనే తపన ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్య కూడా పెయింటింగ్ లో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుంది. పవన్ కళ్యాణ్ నుండి దూరం అయిన తరువాత సినిమా నిర్మాతగా, దర్శకురాలిగా బిజీ అయిన రేణు దేశాయ్ తన పిల్లల్ని కూడా తనతో పాటే ఉంచుకుంటూ పద్దతిగా, క్రమశిక్షణ ప్రకారం పెంచుతుంది.

ప్రస్తుతం రేణు బాలీవుడ్ లో తీస్తున్న ‘ఇష్క్ వాలా లవ్ ’ షూటింగ్ సెట్స్ కి కూతురు ఆద్యను తీసుకెళ్తే  ఆద్య పెయింటిగ్స్ వేస్తూ  తన ప్రతిభను ప్రదర్శిస్తుందట. ఆద్య పెయింటింగ్స్ చూసిన సినిమా యూనిట్ సభ్యులు అంతా ఆశ్చర్య పోతున్నారట. ఈ పెయింటిగ్స్  చూసిన రేణు తెగ మురిసిపోడమే కాకుండా, ఆధ్య గీసిన బొమ్మల్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

అకీరా నందన్ ని సినిమాల్లో నటింపజేయాలని పవన్ పై ఒత్తిడి తెస్తున్న రేణు అందుకు ఆయన్ను కూడా సెట్స్ కి తీసుకెళ్లి అక్కడి వాతావరణానికి అలవాటు చేస్తుందట. ఇన్నాళ్లు రాజకీయాల్లో బిజీబిజీగా గడిపిన ఫారిన్ ట్రిప్ కి పిల్లల కోసం వెళ్ళిన పవన్ ఈనెల 9వ తేదీ నుండి సినిమాల్లో బిజీ కాబోతున్నాడు. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుండి హీరోలే కాకుండా, పెయింటర్స్ కూడా ఇండస్ట్రీకి రాబోతున్నారన్న మాట.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles