K raghavendra rao to host a tv talk show

K Raghavendra Rao to host a TV talk show, Raghavendra Rao in small screen, director Raghavendra Rao,Veteran Director K Raghavendra Rao,

K Raghavendra Rao to host a TV talk show, Raghavendra Rao in small screen, director Raghavendra Rao,Veteran Director K Raghavendra Rao,

మౌనముని మాట్లాడబోతున్నాడు ?

Posted: 05/29/2014 01:04 PM IST
K raghavendra rao to host a tv talk show

ఎప్పుడు నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నట్లు ఏం మాట్లాడకుండా ఉండే టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమా షూటింగు సెట్స్ లో ఏం మాట్లాడుతాడో తెలియదు కానీ, ఇండస్ట్రీలో ఆయన పాల్గొన్న కార్యక్రమాల వేదికల పైన ఇంత వరకు మాట్లాడిన సందర్భాలు లేవు. మరీ ఎవరైనా బలవంత పెడితే రెండు ముక్కల కన్నా ఎక్కువ మాట్లాడని ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ మౌన ముని అనే బిరుదును ఇచ్చింది.

ఇప్పుడు ఈ మౌనముని బుల్లితెర పై ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారం కాబోయే ఓ టాక్ షోకి హోస్టుగా వ్యవహరించబోతున్నాడని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. టాక్ షో హోస్టుగా వ్యవహరించేవారు ఫన్నీగా, హుందాగా గలగల మాట్లాడాలి. మాట మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్లుగా ఉండే ఈయన టాక్ షోకు హోస్టుగా వ్యవహరించబోతున్నాడంటే ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ఈ షోలో ఆయన హోస్టుగా వ్యవహరించడమే కాకుండా, తానే స్వయంగా నిర్మిస్తూ.. ఆయనే దర్శకత్వం చేయనున్నాడట. ఈ షో బాలీవుడ్ లో నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్ ’ లాగా ఫన్నీగా, ఆంద్యంతం ఆసక్తిగా ఉండేవింధగా పకడ్బందీగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి యాభై వసంతాలు ఇటీవలే పూర్త చేసుకుని ఎంతో పేరు తెచ్చకున్న ఈయన సెకండ్ ఇన్నింగ్స్ గా ప్రారంభించబోతున్న ఈ షోను ఏ మేరకు సక్సెస్ చేస్తాడో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles