Deva katta to direct akhil akkineni debut film

kkineni akhil, Akhil Akkineni debut film, deva katta direct akhil akkineni, Nagarjuna,manam,vikram kumar

Deva katta to direct Akhil Akkineni debut film, father Nagarjuna is looking at many scripts and directors to fix the first project of Akhil in a big bang.

దేవాకట్టాతోనే అఖిల్ ఎంట్రీ ?

Posted: 05/29/2014 02:52 PM IST
Deva katta to direct akhil akkineni debut film

అక్కినేని ఫ్యామిలీ నుండి ఇప్పటికే వెండితెర పై అరంగ్రేటం చేసిన నాగార్జున చిన్నకుమారుడు అక్కినేని అఖిల్ తొలి చిత్రం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇటీవల మీడియాతో మాట్లాడిన అఖిల్ మరో ఇరవై రోజుల్లో పూర్తి క్లారిటీ ఇస్తానని చెప్పడంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇటీవలే ‘మనం ’ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించిన  కాపట్లోనే అఖిల్‌ తనదైన ముద్ర వేసేయడమే కాకుండా పలుపురి ప్రశంసలు పొందిన ఆయన్ను మాస్ అండ్ యాక్షన్ హీరోగా పరిచయం చేస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యిన నాగార్జున ఆ దిశగా కథలు చెప్పమని దర్శకులను పురమాయించాడట.

మరి నాగార్జున ఏ దర్శకుడి తో చేయడానికి ఆసక్తితో ఉన్నాడు ? అఖిల్ ని పరిచయం చేసే దర్శకుడు ఎవరు ? అనే దాని పై ఆరా తీస్తే ఫిలిం ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్న దర్శకుడి పేరు దేవా కట్టా. ‘మనం ’ సినిమాకు దర్శకత్వం వహించిన విక్రమ్ కి ఈ బాధ్యతలు అప్పజెప్పుతాడని అనుకున్నా, మాస్ దర్శకుడితో పరిచయం చేయించాలనుకొని ఈయన్ను ప్రక్కన పెట్టాడు. ఇటీవలే నాగచైతన్య నటించిన చిత్రం  ‘ఆటోనగర్ సూర్య ’ సినిమాను చూసిన నాగ్ ఆ చిత్రానికి ఫిదా అయిపోయి, అఖిల్ బాద్యతల్ని ఆయనకే అప్పజెప్పాలని డిసైడ్ అయ్యి దేవాకట్టాను కథను కూడా తయారు చేయమన్నాడట.

ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్న కట్టా ఫైనల్ స్టోరీని చెప్పడానికి పది పదిహేను రోజులు పడుతుందని చెప్పడంతో అఖిల్ ఇరవై రోజుల టైం పెట్టాడని అంటున్నారు. మొత్తంగా చూస్తుంటే అఖిల్ ఎంట్రీ దేవాకట్టా చేతినుండే అని ఖరారు అయిపోయింది. మహేష్‌, ప్రభాస్‌ తర్వాత వచ్చిన వారిలో లుక్స్‌ పరంగా స్కోర్‌ చేస్తోన్న అఖిల్‌ ఏమేరకు రాణిస్తాడో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles