Trisha tweet on balakrishna movie

Trisha Tweet on Balakrishna Movie,Actress Trisha Balakrishna New Movie, Trisha to Romance Balakrishna, Trisha Confirms Movie With Balakrishna

Trisha posted a tweet saying, Delighted to finally share screen space with the LEGEND.

బాలయ్యతో త్రిష... అరుదైన రికార్డు

Posted: 05/28/2014 03:44 PM IST
Trisha tweet on balakrishna movie

దశాబ్దానికి పైగా వెండితెర పై ఓ వెలుగు వెలిగిన చెన్నై చంద్రం త్రిషకు గత కొంత కాలంగా సరైన అవకాశాలు లేవు. కారణం మార్కెట్లోకి ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త అందాలే. అవును ఏ హీరోయిన్నైనా సినిమా ప్రేక్షకులు ఎన్ని రోజులు చూస్తారు. అందుకే దర్శక నిర్మాతలు ఎప్పుడు ప్రెష్ అందాల వేటలో పడతారు. టాలీవుడ్ లోకి చాలా మంది బ్యూటీలు రావడంతో ఈ సీనియర్ హీరోయిన్ కి ఛాన్సులిచ్చేవారు కరువయ్యారు.

ఇన్నాళ్లు అవకాశాలు లేక గోల్లు గిళ్ళుకున్న ఈ అమ్మడుకి మళ్ళీ ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే తమిళంలో రెండు చిత్రాలకు కమీట్ అయ్యిన ఈమెకు బాలయ్య సరసన భారీ రెమ్యునరేషన్ దాదాపు కోటిన్నరతో కూడిన ఆఫర్ వచ్చిందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఈ వార్తల పై పెదవి విప్పుతూ... సినీ ప్రేక్షకులకు ఓ ట్వీటు పారేసింది. గతంలో బాలయ్య సినిమా ‘లెజెండ్ ’ ను  రిజెక్ట్ చేసిన ఈ అమ్మడుకు చివరకు ఈ లెజెండే దిక్కయ్యాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలందరితో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు బాలయ్యతో నటిస్తుండటంతో టాలీవుడ్ ఆలౌరౌండ్ హీరోయిన్ గా రికార్డుకెక్కనుంది. ఈ సినిమా తరువాత త్రిషను ఇంకే దర్శకుడైనా ముదురు హీరోల సరసన ఛాన్సులిస్తారో లేదో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles