Mega hero ram charan launch cycle rally in hyderabad

Ram Charan, Mega Hero Ram Charan, Mega Hero Ram Charan launch Cycle rally,

Mega Hero Ram Charan launch Cycle rally in Hyderabad

సైకిలెక్కిన చిరంజీవి తనయుడు రామ్ చరణ్ .?

Posted: 03/29/2014 10:39 AM IST
Mega hero ram charan launch cycle rally in hyderabad

అవును కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్ చరణ్  సైకిల్ ఎక్కారు.  ఒక పక్క  చిరంజీవి కారు  కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్న సమయంలో..రామ్ చరణ్ సైకిల్ ఎక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది.  అదీ కూడా  ఎన్నికల సమయంలో రామ్ చరణ్ ఇలాంటి ప్రయోగం చేయటం  అందర్ని  ఆశ్చర్యం కలిగిస్తుంది.   రామ్ చరణ్  సైకిలెక్కటం అంటే.. తెలుగుదేశం పార్టీ చేరినట్లు కాదులేండి. 

‘ఎర్త్ అవర్’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం లో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ పాల్గొన్నారు. ఆ సమయంలో  డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ ,మెట్రో రైల్ సంస్థ  వారు  సైకిల్  రైడ్ కార్యక్రమం  నిర్వహించారు.  

చరణ్ చేతులు మీదుగా  సైకిల్ రైడ్ ప్రారంభించారు.  ఆధునిక యుగంలో కాలుష్యం పెరుగోంది.దీని వల్ల చాలా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిసి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. 

రామ్ చరణ్ మాట్లాడుతూ..  కాలుష్యం లేని వాతావరణ కావాలని , దీని కోసం  ప్రతిఒక్కరు  క్రుషి చేయాలి.  ముఖ్యంగా పారిశ్రామిక వేత్తలు బాధ్యతాయుతంగి ప్రవర్థించి వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు సమకరించాలని కోరారు. ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడాలన్నారు.అందులో భాగంగానే మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టామన్నారు.

‘ ఎర్త్ అవర్’ కార్యక్రమానికి రామ్ చరణ్ ఈ సంవత్సరం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ‘పెడల్ ఫర్ ది ప్లానెట్’ పేరుతొ పర్యావరణం పై అవగాహన పెంచే విధంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొననున్న చరణ్ తో పాటు వందలాది గా ప్రజలు అతనితో చేతులు కలుపుతారని నిర్వాహకులు భావిస్తున్నారు. రాత్రి 8.30 నుంచి ఒక గంటపాటు అన్ని విధ్యుత్ పరికరాలను ఆఫ్ చేయమని నిర్వాహకులు ప్రజలను కోరారు.

కాగా రామ్ చరణ్ హీరో గా తెరకెక్కుతున్న ‘గోవిందుడు అందరి వాడేలే’ తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ రెండవ వారం నుంచి హైదరాబాద్ లో మొదలవనుంది. రామ్ చరణ్ సరసన కాజోల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles