Anushka to pair up rajinikanth

Superstar Rajinikanth, Anushka pair up Rajinikanth, Anushka in Rajinikanth new movie, Rajinikanth and Anushka movie, Rajinikanth to romance Anushka

Superstar Rajinikanth is gearing up for his next film in KS Ravikumar direction and Anushka Shetty is keen to play the female lead falongside Rajinikanth.

బొమ్మాళికి దిమ్మ తిరిగే ఆఫర్ తగిలింది

Posted: 03/04/2014 10:40 AM IST
Anushka to pair up rajinikanth

బొమ్మాళి అనుష్కకు సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోయిన్లకు రాని ఓ బంపర్ ఆఫర్ తగిలింది. హీరోయిన్ గా ఉన్నప్పుడు ఒక్కసారైనా సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించాలని కలలు కనే ఈ అద్భుతమైన ఆఫర్ అనుష్కకు దక్కిందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

ప్రస్తుతం ‘కొచ్చాడయాన్ ’ సినిమా లో నటించిన రజినీ తన తరువాత ప్రాజెక్టును దర్శకుడు కె.యస్. రవికుమార్ తో చేయబోతున్నాడు. ఈ సినిమా లో రజినీ సరసన అనుష్కను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి సినిమాలో బిజీగా ఉన్న ఈ అమ్మడు రజినీతో ఆఫర్ అనగానే గౌతమ్ మీనన్ మూవీని కూడా అనుష్క పక్కనపెట్టినట్లు కూడా చెబుతున్నారు.

గతంలో రెండుసార్లు రజనీ పక్కన నటించే చాన్స్ మిస్సయిన అనుష్క, ఇప్పుడీ చాన్స్ వదులుకోకూడదన్న గట్టి నిర్ణయంతో, డేట్స్ సర్దుబాటు చేసుకుందని అంటున్నారు. ఈ సినిమాను కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మించబోతున్నారని తెలుస్తుంది. అనుష్కకు అనుకోకుండా ఈ ఆఫర్ రావడంతో ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అవుతుందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles