Hansika high speed romance in movies

hansika, ctress Hansika motwani, hansika high speed romance in movies,hansika high speed romance, hansika act 5 movies, tollywood, kollywood, bollywood, hansika love, hansika simbu.

hansika high speed romance in movies

హన్సిక దూకుడు.. అల్లాడిపోతున్న హీరోలు

Posted: 02/19/2014 12:13 PM IST
Hansika high speed romance in movies

ఇటీవల టాలీవుడ్‌లో అవకాశాలు పెరగడంతో ఈ బొద్దుగుమ్మ కాస్త చిక్కి అందమైన పాలరాతి శిల్పంలా తయారైంది. బాలనటిగా బాలీవుడ్‌లో ప్రవేశించి... దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది హన్సిక. 

ఓ వైపు తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తూనే... మరో వైపు కోలీవుడ్‌లో తనదైన శైలిలో టాప్‌ హీరోయిన్‌ అయిపోయింది. అక్కడ అనతికాలంలోనే జూనియర్‌ ఖుష్బూగా పేరు తెచ్చుకుంది.  తమిళంలోనూ మరో ఐదు చిత్రాల్లో నటించడానికి రెడీ అయిందట ఈ అమ్మడు. తాను బాలీవుడ్‌లో కెరీర్‌ ప్రారంభించినా... దక్షిణాదినే ఎక్కువ అవకాశాలను దొరకబుచ్చుకుంటోంది.

 తన మొదటి ప్రయారిటీ తెలుగు, తమిళమే అంటోంది ఈ అమ్మడు. దక్షిణాదిన రాణించిన ఉత్తరాది భామలంతా బాలీవుడ్‌వైపు చూస్తారు కదా... మీరు బాలీవుడ్‌లో నటిస్తారా అంటే... అబ్బే అటువైపు వెళ్ళే ఆలోచన ఇప్పుడే లేదు అంటోంది హన్సిక. 

ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా ఫుల్‌ఫిల్‌ చేస్తూ యమా స్పీడుగా సిల్వర్‌ స్క్రీన్‌పై దూసుకెళ్ళడమే తన ముందున్న కర్తవ్యం అంటోంది. 

ప్రస్తుతం తెలుగులో రవితేజతో పవర్‌ పంచనుంది. అలాగే నాగచైతన్యతో కలిసి దుర్గగా ముందుకొస్తోంది. వీటిలో నటిస్తూనే మనోజ్‌తో ఓ సినిమాలో నటించడానికి రెడీ అవుతోంది. ఇలా తెలుగులో ఓ ఐదు సినిమాల్లో నటించడానికి సిద్ధమైంది ఈ చక్కనమ్మ.  హన్సిక దూకుడు దెబ్బ టాలీవుడ్ , కోలీవుడ్ హీరోల సైతం అల్లాడిపోతున్నారు.   

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles