R p patnaik ropes in priyamani for his kannada film

Priyamani, R P Patnaik, Priyamani Kannada Film, RP Patnaik - Priyamani, Music composer RP Patnaik, Telugu films like Broker, Priyamani Committed To Patnaik.

R P Patnaik ropes in Priyamani for his Kannada film, RP Patnaik - Priyamani Kannada Film

ప్రియమణితో పట్నాయక్ పొలిటికల్ రొమాన్స్

Posted: 02/19/2014 12:45 PM IST
R p patnaik ropes in priyamani for his kannada film

ప్రియమణి అంటే  పెళ్లైన కొత్తలో పెళ్లి కూతురు గుర్తుకు వచ్చేంది. కానీ  ఇపుడు  ప్రియమణి అంటే ‘చండి’ అని గుర్తుకు వస్తుంది. అందాన్ని తెర మీద ఆరబోయటంలో ప్రియమణి బాగానే మార్కులు కొట్టేసింది. కానీ ఆమె  అందాలు.. ఎక్కువ కాలం వెండితెరపై నిలవలేకపోయిన విషయం తెలిసిందే.  

అతి తక్కువకాలంలోనే.. ప్రియమణి  ఫేడ్ అయ్యింది . దీంతో  ఆమెను టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు  సినిమాలకు దూరంగా పెట్టారు. అప్పడప్పుడు ఐటమ్ పాపగా కనిపించి .. తన అందాలకు ఉన్న పదునును  చూపిస్తూ..  సినిమా ఛాన్స్ ల కోసం ఎర  వేసేది. 

కానీ  ప్రియమణి బికినిలో వచ్చినప్పుడే.. ఆమెకు అవకాశాలు  చాలా అరుదుగా వచ్చాయి. ఇప్పుడు  ఎన్ని చూపించిన  సినిమా అవకాశాలు రావటం కష్టమే అని  తోటి హీరోయిన్స్   పెదవిరుస్తున్నారు.  అయితే  ప్రియమణికి  మరో  అవకాశం వెతుకుంటూ వచ్చింది.  

దర్శకుడిగా మారిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఇప్పుడు శాండిల్ వుడ్ కి  సినిమా తీస్తున్నాడు. అయితే తొలిసారిగా ఆయన ఓ కన్నడ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. శాండిల్ వుడ్ లో తీసే సినిమాకు   ప్రియమణి హీరోయిన్  తీసుకున్నట్లు సమాచారం.  

పట్నాయక్ చెప్పిన కథ వినగానే ప్రియమణి ఎంతగానో థ్రిల్ అయిందనీ, వెంటనే డేట్స్ కేటాయించిందనీ సమాచారం. ఇందులో ఆమె పవర్ ఫుల్ సీబీఐ ఆఫీసర్ పాత్రను పోషిస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో బెంగళూరులో మొదలవుతుంది. 

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో దీనిని పట్నాయక్ రూపొందించనున్నాడు. పట్నాయక్  గతంలో  ‘బోకర్ ’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.  అయితే  ఈ బోకర్  ప్రియమణి జీవితాన్ని మార్చుతాడా? అని శాండిల్ వుడ్ లో  జోకులు పేలుతున్నాయి. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles