Hero surya replacing mahesh babu

Hero Surya, Mahesh Babu, Raj-Krishna, Aagadu, Ashwini Dutt, Raj and Krishna, Ashwini Dutt banner, Hero Surya replacing Mahesh

Suriya is impressed with same story of Raj and Krishna. The actor Surya gave nod for Ashwini Dutt.

మహేష్ ప్రాజెక్టును సూర్య కొట్టేశాడు

Posted: 02/16/2014 09:00 AM IST
Hero surya replacing mahesh babu

సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒకరు చేయాల్సిన సినిమాను మరొకరు, ఒకరు రిజెక్ట్ చేసిన కథను మరో హీరో ఓకే చేస్తారు. ఇప్పుడు అలాంటిదే జరిగింది ఇక్కడ. టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథను తమిళ హీరో సూర్య ఓకే చేశాడు. విషయం ఏంటంటే ఆ మధ్యన మహేష్ బాబు బాలీవుడ్ దర్శక నిర్మాతలు అయిన రాజ్ - డీకే దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

తీరా వారు వినిపించిన కథ మహేష్ బాబుకు నచ్చక పోవడం ఆ సినిమా నుండి తప్పుకున్నట్లు సమాచారం. ఇదే కథను హీరో సూర్యకు వినిపిస్తే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించడానికి అశ్వినీదత్ ప్లాన్ చేస్తున్నాడట. మహేష్ బాబు కూడ అశ్వినీదత్ కి ఓ సినిమా చేస్తానని మాటిచ్చాడు.

ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో మరో దర్శకుడితో చేసే సినిమా వైజయంతి బ్యానర్ లో చేస్తాడేమో చూడాలి. ఇక సూర్య ఇప్పటి వరకు తెలుగులో అన్ని డబ్బింగ్ సినిమాలే చేశాడు. ఈ సినిమా కనుక పట్టాలెక్కితే సూర్యకు తొలి తెలుగు స్ర్టెయిట్ సినిమా అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles