Mega family wishes to brahmanandam son

Pawan Kalyan,Basanti,Gautam,Brahmanandam, Gowtam, Johncy Lever, Sunil, Vishnu, Chaitanya Dantuloori, Deva Katta, mega family

Pawan Kalyan has launched the Basanti audio at the event took place at Park Hyatt Hotel on Sunday.

మెగా పవర్ ని ఫుల్లుగా వాడుకున్నాడు

Posted: 02/10/2014 10:37 AM IST
Mega family wishes to brahmanandam son

నటుడు బ్రహ్మానందం తన కొడుకును హీరోగా నిలబెట్టడానికి ఇండస్ట్రీలో ఉన్న పవర్ ని మొత్తం వాడుకున్నాడనిపిస్తుంది నిన్న జరిగిన ‘బసంతి ’ ఆడియో ఫంక్షన్ ని చూస్తే. బ్రహ్మీ తనయుడు గౌతమ్ హీరోగా ఇండస్ట్రీలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన అనుకున్నంత సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆయన నటించిన ‘బసంతి ’ ఆడియో ఫంక్షన్ ని పార్క్ హయత్ హోటల్లో నిన్న రాత్రి గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ వచ్చి  ఆడియోను విడుదల చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు సబంధించిన ట్రైలర్ను మహేష్ బాబు చేత రిలీజ్ చేయించగా, ఓ పాటను ఎన్టీఆర్ చేత, మరో పాటను అల్లు అర్జున్ చేత వెరైటీగా రిలీజ్ చేయించి తానేంటో, తన పవర్ ఏంటో  నిరూపించుకున్న బ్రహ్మానందం ఆడియోను కూడా గ్రాండ్ గా నిర్వహించాడు. ‘బాణం ’ దర్శకుడు  చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకు చిరంజీవి కూడా తన వంతుగా సాయం అందించాడు.

ఆడియోకు స్వయంగా రాకపోయినా ఓ వీడియో బైట్ ద్వారా తన సందేశాన్ని ఇచ్చాడు.  ‘‘గౌతమ్ నాకు బిడ్డలాంటి వాడు. తల్లి పోలికను, తండ్రి ప్రతిభను పుణికిపుచ్చుకున్నాడు. మంచి హీరోగా రాణించగలిగే అన్ని లక్షణాలూ తనలో వున్నాయి. తను నాకు పసితనం నుంచీ తెలుసు. మా ఇంటికి వచ్చి చరణ్ తో ఆడుకునేవాడు. మా చరణ్ కి విజయం వస్తే ఎంతగా ఆనందిస్తానో, గౌతమ్ కి వచ్చినా అంతగానూ ఆనందిస్తాను ’’ ఈ సినిమా గౌతమ్ కి టర్నింగ్ పాయింట్ కావాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... గౌతమ్, ఈ సినిమాకు దర్శకత్వం వహించిన చైతన్య కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాని అన్నాడు. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేడయంతో పలు ఛానళ్లు లైవ్ కవరేజ్ ఇవ్వడంతో ఈ సినిమాకు కావాల్సినంత ప్రచారం లభించింది. ఈ ఆడియో వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి తదితరులు వచ్చారు. ఇక బాలీవుడ్ కమేడియన్ అయిన జానీలీవర్ వచ్చి తన కామెడీతో పలువుర్ని నవ్వించి ఈ వేడుకకు హైలెట్ గా నిలిచాడు.


Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles