Naga chaitanya latest movie is titled durga

Naga Chaitanya, Durga, Srinivas reddy, Nagarjuna, Anup Rubens, Annapurna studios, Hansika,

Naga Chaitanya latest movie is titled Durga. Damarukam fame Srinivas Reddy will be directing the film.

నాగచైతన్య ‘దుర్గ ’ గా వస్తున్నాడు

Posted: 02/07/2014 01:43 PM IST
Naga chaitanya latest movie is titled durga

అక్కినేని నాగచైతన్య నటించిన ‘ఆటోనగర్ సూర్య ’ సినిమాకు ఇంత వరకు మోక్షం లేకపోయినా, చైతూ మాత్రం కొత్త చిత్రాలు చేసుకుంటూ వెళుతున్నాడు. త్వరలో ఇతను ప్రేక్షకుల ముందుకు ‘దుర్గా ’ గా రాబోతున్నాడు. నాగార్జునకు ఆప్త మిత్రుడు, దర్శకుడు అయిన శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ సినిమాకు ‘దుర్గా ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు.

ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రామానాయుడు వచ్చి తొలిషాట్ కి క్లాప్ ఇవ్వగా, వి.వి. నాయక్ గౌరవ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా లో మాస్ అండ్ యాక్షన్ కాకుండా కావాల్సినంత కామెడీ కూడా ఉంటుందని, నాగార్జునకు ‘శివ ’ లాగ చైతూకి ‘దుర్గా ’ ల్యాండ్ మార్క్ అవుతుందని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. చూద్దాం ఈ సినిమా అయినా సకాలంలో పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles