Ms narayana daughter start to debut film

M S Narayana daughter, sasikiran turns director, MS Narayana daughter debut film, M S Narayana daughter Sasi

M S Narayana daughter Sasi is going to debut as a director with maklayali remake in Telugu. She has already directed several games on TV.

ఎమ్మెస్ కూతురు కూడా మొదలు పెట్టింది

Posted: 02/05/2014 04:02 PM IST
Ms narayana daughter start to debut film

టాలీవుడ్ ప్రేక్షకులకు కమేడియన్ గా సుపరిచితం అయిన నటుడు ఎమ్మెస్ నారాయణ. తన హస్యంతో, నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఈయన ఫ్యామిలీ నుండి వెండితెరకు ఈయన కూతురు శశికిరణ్ ఎంట్రీ ఇచ్చి ఇచ్చింది. ఈమె మెగా ఫోన్ పట్టి ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతుంది.

గతంలోనే ఈమె దర్శకురాలిగా అవతారం ఎత్తబోతుందని వార్తలు వచ్చినా, ఇన్ని రోజుల తరువాత ఆమె డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె దర్శకత్వం వహించే సినిమా హైదరాబాద్ లో ప్రారంభోత్సవం జరుపుకొని, షూటింగ్ కూడా శర వేగంగా జరుపుకుంటుంది. కొత్త నటీ నటులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పేరును నిర్ణయించలేదు.

ఇందులో రముఖ క్యారెక్టర్ నటుడు రావు రమేష్ ఇందులో కీలక పాత్ర పోషిస్తుండగా, ఎమ్మెస్ తనయుడు విక్రం కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. రెండేళ్ళ క్రితం వచ్చిన ఓ మలయాళ సినిమా ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఓ ఎన్నారై నిర్మిస్తున్నాడు. తొలిసారిగా వెండితెర పై మెగా ఫోన్ పట్టిన ఈమెకు కొన్ని టీవీ గేమ్ షోలను రూపొందించిన అనుభవం ఉంది. దర్శకత్వ శాఖలో ఈమె ఉన్నత శిఖరానికి చేరుకోవాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles