Adah sharma attracts big heroes

adah sharma, adah sharma more offers, adah sharma attacts big heroes, adah sharma big offers

Puri was in fact best suited for Adah who gave a fresh look and cool flavor to the total film in first half

స్టార్ హీరోల హార్ట్ బీట్ పెంచుతుంది

Posted: 02/05/2014 11:00 AM IST
Adah sharma attracts big heroes

పూరీ జగన్నాథ్ ప్రతి సినిమాకో కొత్త హీరోయిన్ ని పడతారు. ఎంతో మంది అందమైన స్టార్స్ ఉన్నా కానీ ఇండస్ట్రీకి కొత్త కొత్త వారిని దిగుమతి చేస్తాడు. సదరు హీరోయిన్లు కూడా ఆయన సినిమాల్లో నటించే ఛాన్స్ వస్తే వదులుకోక పోవడమే కాకుండా అందాలను కూడా విరివిగా ఆరబోస్తారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘హార్ట్ ఎటాక్ ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన ఆదా శర్మ కూడా ఆ సినిమాలో తన అందచందాలతో కుర్రకారు మతిపోగొట్టింది.

హార్ట్‌ ఎటాక్‌ చిత్రంలో హయాతీగా తన పెర్ఫామెన్స్‌తో యూత్‌కి బాగా కిక్కిచ్చింది. దీంతో టాలీవుడ్‌లో అమ్మడికి ఆఫర్లు భారీగా వచ్చి పడుతున్నాయి. అయితే క్రేజీ ఆఫర్స్‌ ఆదా తలుపు తడుతున్నా ఆచి తూచి వ్యవహరిస్తోందట. ఛాన్సులు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా చాలా కేర్‌ తీసుకుంటానంటోంది హయాతీ. కాగా ఇప్పటికే టాలీవుడ్‌లో ఓ స్టార్‌ హీరో అదా అందానికి ముగ్ధుడై తన తర్వాత సినిమాలో అదాని బుక్‌ చేయమని నిర్మాతలకు హుకుం జారీ చేశాడట.

ప్రస్తుతం చర్చల థలో ఉన్న ఈ సినిమా కన్ఫర్మ్‌ అయితే అదాను దాపుగా ఖరారు చేసినట్లే. మరి కుర్రాళ్ళకు అదా ఇచ్చిన హార్ట్‌ ఎటాక్‌ స్ట్రోక్‌ బాగానే పనిచేస్తుందమాట. చూద్దాం ముందు ముందు ఎన్ని ఇంకెంత మంది హీరోల మనస్సు దోచేస్తుందో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles