Kajal agarwal final in gabbar singh 2

Kajal On Gabbar Singh 2 movie, Actress Kajal On Gabbar Singh 2 movie, Kajal Agarwal in Gabbar Singh 2, remuneration Rs.2 crores.

Pawan Gabbar Singh2 is still reeling under initial hiccups with the producers unable to find a suitable heroine opposite to Power Star

పవన్ - చరణ్ లకి కాజల్ దిక్కయింది

Posted: 01/11/2014 09:39 AM IST
Kajal agarwal final in gabbar singh 2

టాలీవుడ్ లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ త్వరలో గబ్బర్ సింగ్ -2 సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వస్తుంది. కారణం ఆయనకు జోడీగా హీరోయిన్ దొరక్కపోవడమే టాక్ ఉంది. మొదట్లో ఈయన సరసన కాజల్ ని ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి.

కానీ ఈ అమ్మడు పారితోషికం విషయంలో కొండెక్కి కూర్చోవడంతో వెనక్కి తగ్గిన చిత్రయూనిట్ కొత్త అమ్మాయిని, అదీ అచ్చ తెలుగు పదహారణాల అమ్మాయిని ఎంపిక చేయడానికి ఆడిషన్స్ కూడా నిర్వహించారు. కానీ ఈయనకు సరిజోడి దొరక్కపోవడంతో ఆ ప్రయత్నాన్ని వదులుకొని మళ్ళీ పాతవారినే పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. ‘ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కు ’ అన్న సామెత మాదిరి చిత్ర యూనిట్ చూపు మళ్లీ కాజల్ పైనే పడిందట. మొదట్లో డిమాండ్ చేసినా ఇచ్చుకోవడానికి సిద్దపడి ఈమెనే ఖరారు చేసినట్లు ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి.

అయితే సినీ జనాలు మాత్రం మెగా హీరోల సరసన నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రాకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మొన్నటికి మొన్న క్రిష్ణ వంశీ రామ్ చరణ్ సినిమా కోసం కూడా మొదట్లో వేరే అమ్మాయిని తీసుకోవాలని చూసినా ఎవరూ నటించడానికి ముందుకు రాకపోవడంతో చివరికి కావాల్సినంత ఇచ్చుకొని కాజల్ నే బుక్ చేసుకున్నారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు. మొత్తానికి మెగా హీరోలకు కాజలే దిక్కయిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles