Mahesh 1 movie to be shortened by 26 mins

Nenokkadine, Mahesh babu, kriti sanon, Nenokakdine trimmed 20 min, Nenokakdine movie trimmed, 20 min trimmed from nenokkadine movie

According to reports, many viewers complained that at 2 hours 26 minutes, the film tends to drag a little bit.

మహేష్ సినిమాకు కత్తెర్లు మొదలు పెట్టారు

Posted: 01/11/2014 02:31 PM IST
Mahesh 1 movie to be shortened by 26 mins

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘1’ నేనొక్కడినే సినిమా భారీ అంచనాల మధ్య నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచానాలు పెట్టుకుంటే... అందుకు తగ్గట్లే ట్రైలర్లతో సినిమా పై హైప్ పెంచారు.

తీరా విడుదల అయిన తరువాత మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, సినిమా లెన్తీ ఎక్కువగా ఉండి నస పెడుతుందని టాక్ రావడంతో సినిమాకు కత్తెర్లు వేస్తున్నారు. దాదాపు 20 నిమిషాలకు పైగా ఈ సినిమాను కత్తిరించనున్నట్లు ఆ సినిమా నిర్మాత అయిన అనిల్ సుంకర మీడియాకు తెలిపాడు. ఈ సినిమాను రేపటి నుండి థియేటర్లలో చూడవచ్చని చెబుతున్నారు.

సినిమా పై ఉన్న అంచనాలతో భారీ ఓపెనింగులే వచ్చినా, డివైడ్ టాక్ తో రెండో రోజు ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి. సెన్సార్ వాళ్ళు చేయని ఈ పనిని చిత్ర యూనిట్ వారు రెండో రోజే గుర్తించడం ఈ సినిమాకు కాస్తంత ఊరట కలిగించే విషయమే. మరి ఇలా అయినా సినిమాకు కలిసి వస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles