Mahesh acting rayalseema backdrop film

Mahesh babu Aagadu Movie, Mahesh babu, Agadu Movie, Telugu News, Superstar Mahesh babu, Aagadu Story, Mahesh in Rayalseema backdrop film,

Aagadu is having a Rayalseema backdrop and the film is set in Tadipatri of Anantapur district.

మహేష్ బాబు ఫ్యాక్షనిజం

Posted: 01/06/2014 03:53 PM IST
Mahesh acting rayalseema backdrop film

మహేష్ బాబు శీను వైట్ల కాంబినేషన్లో ఇది వరకు వచ్చిన ‘దూకుడు ’ సినిమా ఎంత పెద్ద ఘన విజయాన్ని సాధించించో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నమ్మకంతోనే శీనువైట్లతో మరో సినిమా చేస్తున్నాడు మహేష్. ఇప్పటి వరకు వెండితెర పై రొమాంటిక్ అండ్ యాక్షన్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. కానీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘ఆగడు ’ సినిమాలో మహేష్ ని పక్కా మాస్ గా చూపించబోతున్నాడని, ఈ సినిమా మొత్తం సీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని ఫిలింనగర్ సమాచారం.

గతంలో చాలా మంది హీరోలు ఫ్యాక్షనిజం పేరుతో చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించినవి ఉన్నాయి. అంతే కాకుండా చాలా మంది దర్శకులు నమ్ముకున్న ఈ ఫార్ములా బాగా వర్కౌట్ కావడంతో శీనువైట్ల కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడని అంటున్నారు. ఇప్పటి వరకు కామెడీ, రొమాంటిక్ కథల్ని తెరకెక్కించిన శీను వైట్ల ఫ్యాక్షనిజం పేరుతో మహేష్ పై ప్రయోగం చేస్తున్నాడని అంటున్నారు. ఈ స్టోరీ మొత్తం అనంతపురం తాడిపత్రి గ్రామం బ్యాక్ డ్రాపే కావడంతో , దీనికి సంబంధించిన సన్నివేశ్నాల్ని గుజరాత్ లో సెట్స్ వేసి చిత్రీకరిస్తున్నారు.

తొలిసారి పూర్తి స్థాయి మాస్, ఫ్యాక్షనిజం ఆధారంగా వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles