Sussanne denied rs 100 crore divorce settlement

Sussanne Roshan, Sussanne, Hrithik Roshan, rubbishes,Rs 100-crore, divorce, settlement, Sussanne denied Rs 100-crore settlement

Sussanne Roshan Saturday denied a media reports saying her divorce from Hindi movie star Hrithik Roshan is a Rs.100 crore settlement.

భరణం కింద 100 కోట్లు డిమాండ్ చేసింది

Posted: 12/30/2013 09:48 AM IST
Sussanne denied rs 100 crore divorce settlement

బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్ భార్య సుజానేతో విడిపోతున్నట్లుఇటీవలే మీడియా ముఖంగా చెప్పిన విషయం తెలిసిందే. సుజానే నాతో ఉండటానికి ఇష్టపడటం లేదని అందుకే తామిద్దరం విడిపోవాలనే నిర్ణయానికి వచ్చామని చెప్పాక వీరి పెళ్లి పెటాకుల పై అనే రూమర్లు వచ్చాయి.

హృతిక్‌ రోషన్ బార్బర మోరీతో ఎఫైర్ నడపడమే కారణం అని, కాదు వీరిద్దరు విడిపోవడానికి బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాలే కారణం అని ఇలా రకరకాల వార్తలు బయటకి వచ్చాయి. బాలీవుడ్ లో చర్చనీయాంశమైన ఈ వ్యవహారంలో ఇప్పుడు మరో ఉదంతం బయటకి వచ్చింది. వీరు గత కొన్ని రోజులుగా విడిగా ఉంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారని, విడాకులు కోరినందుకు సుజానే హృతిక్‌ రోషన్ దగ్గర నుండి భరణం కింద వంద కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని, ఈ విషయంలో ఇరువురి తరుపు న్యాయవాదులు సెటిల్ చేసే పనిలో ఉన్నారని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రసారం చేసింది.

అసలే విడిపోయిన బాధలో ఉన్న సుజానే ఈ వార్తల పై స్పందిస్తూ... ‘అసలే క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న నాపై మీడియా ఇలాంటి కథనాలు వ్రాయడం సరికాదని, అసలు నేను హృతిక్‌ రోషన్ ని వందకోట్లు అడగటం ఏంటని ప్రశ్నించింది. నా పై వస్తున్న వార్తలు అన్ని నిరాధారమైనవని దయచేసి మీడియా ఇలాంటివి ప్రసారం చేయవద్దని విన్నవించింది.

గతంలో టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ కూడా తన భార్య రేణుదేశాయ్ కి  భరణం కింద 60 కోట్లు ఇచ్చాడని దాని కోసం ఆస్తులు అమ్ముకున్నాడని రూమర్లు వచ్చాయి. రేణుదేశాయ్ అంత అడిగినప్పుడు సుజానే వంద కోట్లు అడిగిందనే వార్తల్లో కూడా కాస్తంత నిజం ఉండే ఉంటుందని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles