Autonagar surya to release on jan31

‘ఆటోనగర్ సూర్య ’ కు మోక్షం కలిగింది

Posted: 12/30/2013 11:10 AM IST
Autonagar surya to release on jan31

నాగచైతన్య హీరోగా, దేవాకట్టా దర్శకత్వంలో ‘ఆటోనగర్ సూర్య ’ చిత్రానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆర్థిక కారణాల వల్ల ఇన్ని రోజులు షూటింగు ఆగిపోయిన ఈ చిత్రానికి ఇటీవలే మోక్షం దక్కింది. ప్రస్తుతం షూటింగు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జనవరి 31న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు దర్శకుడు దేవాకట్ట తెలిపాడు.

సంక్రాంతి తరువాత ఈ చిత్రం ఆడియోను విడుదల చేస్తామని చెప్పాడు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈసారైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేక మళ్లీ వాయిదా పడుతుందో తెలియాలంటే జనవరి 31వ వరకు ఆగాల్సిందే. చాలా గ్యాప్ తో వస్తున్న ఈ చిత్రం నాగచైతన్యకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

అదే రోజు నితిన్ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ‘హార్ట్ ఎటాక్ ’ సినిమా కూడా విడుదల కాబోతుంది. దేవా కట్టా తన ఆటోతో ‘హార్ట్ ’ పై ఎటాక్  చేయబోతున్నాడని సినీజనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles