Sridevi daughter jhanvi with shanmuga pandian

Sridevi, Daughter Jhanvi, Shanmuga Pandian, Sridevi Kapoor, boni kapoor, daughter Jhanvi,

sridevi daughter jhanvi with shanmuga pandian movie.

తమిళ తెర పై జాహ్నవి అరంగ్రేటం

Posted: 12/16/2013 06:51 PM IST
Sridevi daughter jhanvi with shanmuga pandian

అతిలోక సుందరి శ్రీదేవి తన పెద్ద కూతురు జాహ్నవిని వెండితెర అరంగ్రేటం చేయించడానికి తగిన సమయం కోసం చూస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితం నుండి ఈమె మొదటి సినిమా టాలీవుడ్ లో ఉంటుందని, కాదు కాదు బాలీవుడ్ లో ఉండబోతుందని ఇలా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈమె అరంగ్రేటం తమిళంలో ప్రముఖ హీరో విజయ్ కాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్ తో ఉంటుందని టాక్. షణ్ముగ పాండియన్ హీరోగా పరిచయం చేస్తూ, విజయకాంత్ సొంతగా నిర్మిసున్న ఈ చిత్రానికి ‘శతాబ్దం ’ అనే టైటిల్ ఖరారు చేశారు. సంతోష్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అతనికి జతగా శ్రీదేవి కూతురు జాహ్నవిని తీసుకోవాలని నిర్ణయించి, దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. 

లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌ట్రైనర్‌‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి జాహ్నవి అయితేనే బాగుంటుందని కూడా చిత్ర యూనిట్ భావిస్తుంది. ఒకవేళ శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే జాహ్నవి ఎంట్రీ తమిళ తెర పై ఉండబోతున్నందన్న మాట. ఈ విషయం పై క్లారిటీ రావంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles