Chiru 150th movie under shankar direction

Chiru 150th movie under Shankar direction, Mega Star Chiranjeevi 150th film , chiranjeevi news, indian celeb chiranjeevi, chiranjeevi latest news, Shankar direct to Chiranjeevi,

As per the latest rumors from Film Nagar, the ground work for Mega Star Chiranjeevi 150th film under Shankar direction.

అన్న 150 వ సినిమా వచ్చేస్తుంది

Posted: 11/28/2013 03:44 PM IST
Chiru 150th movie under shankar direction

ఎప్పటి నుండో వేయి కళ్ళతో, ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న మెగా అభిమానులు త్వరలో గుడ్ న్యూస్ వినబోతున్నారా ? గత కొన్ని సంవత్సారాల నుండి వాయిదా పడుతూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతుందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ తెర వెనుక చకచక జరిగిపోయాయని అధికారిక ప్రకటన రావడమే తరువాయి అనే వార్త ఫిలింనగర్ లో జోరుగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన ఈయన శంకర్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

గతంలో ఓసారి శంకర్ అవకాశం ఇస్తే నటిస్తానని చెప్పాడు కూడా. పలు సందర్భాల్లో తన 150 సినిమా ఉంటుందని అభిమానులకు చెప్పిన చిరు ఆ ఒక్క సినిమా తీసి అభిమానుల కోరిక తీర్చడానికి డిసైడ్ అయ్యాడని ఈ సినిమాను  వచ్చే సంవత్సరం మార్చి నుండి సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నారని, ప్రస్తుతం శంకర్ హీరో విక్రమ్ తో తీస్తున్న ‘ఐ ’ సినిమా పూర్తి అయిన వెంటనే చిరు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తాడని అంటున్నాడు. అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ రాజకీయాల్లోకి వచ్చి బిజీ అవ్వడంతో సినిమాకు స్విస్తి చెప్పాలని అనుకున్నాడు... కానీ అభిమానుల కొసం ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యనట్లు చెబుతున్నారు. మరి సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఓ కారణం కూడా ఉందని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమని సర్వేలు చెబుతుండటంతో రాజకీయాల కంటే సినిమాలే బెటర్ అనే ఆలోచనకు వచ్చాడని అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. ఇవి కూడా నిజమో కాదో తెలియాలంటే మెగా కంపౌండ్ నుండి స్పష్టమైన ప్రకటన రావాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles