Sampath nandi assistant to pawan kalyan

Sampath Nandi assistant to Pawan kalyan, Pawan kalyan as Gabbar Singh-2 Asst. Director, Pawan kalyan 's Gabbar Singh-2 release, Sampath Nandi assistant to Pawan

Pawan Kalyan has taken director Sampath Nandi is working more like an assistant to Pawan.

పవన్ కి అసిస్టెంట్ గా సంపత్ నంది

Posted: 11/27/2013 08:04 PM IST
Sampath nandi assistant to pawan kalyan

పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలో సంపత్ నంది దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం దర్శకుడు చాలా రోజుల నుండి కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఆరంభం కావాల్సిన ఈ సినిమా లేట్ అయినా కానీ పక్కా ప్లానింగుతో సిద్దం అవుతున్నారు. ఇన్ని రోజుల నుండి ఈ సినిమాకు దర్శకుడు సంపత్ నంది అనే విషయం అందరికి తెలుసు. కానీ టాలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ఏంటంటే.... ఈ సినిమాకు సంపత్ నంది కో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడని, అసలు దర్శకుడు మాత్రం పవన్ కళ్యాణ్ అనే టాక్ వినిపిస్తుంది.

పవన్ సొంతంగా సినిమా చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అందుకే పేరు కోసం మాత్రమే సంపత్ నందిని వాడుకుంటున్నాడని ఇన్ని రోజులు పవన్ చేసే స్క్రిప్టు వర్కును ఒక పద్దతి ప్రకారం చేసుకుంటూ పోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడని, వెనకనుండి పవన్ ఏది చెబితే అది చేస్తూ మాత్రమే పోతున్నాడని అంటున్నారు. ఇక సంపత్ నంది కూడా పవన్ తో సినిమా చేసిన పేరు వస్తే చాలన్నుట్లుగా ఆయన వద్ద అసిస్టెంట్ గా కూడా చేయడానికి సిద్దమయ్యాడని అందుకే పవన్ హరీశ్ శంకర్ ని పక్కన పెట్టాడనే టాక్ కూడా వినిపిస్తుంది.

గతంలో పవన్ కళ్యాణ్ పలు సినిమాల్లో తన చేతి వాటాన్ని చూపిన సినిమాలు డిజాస్టర్ అయిన సంగతి మరచిపోయాడో ఏమో కానీ ఇప్పుడు వచ్చిన క్రేజ్ తో ఏం చేసినా నడుస్తుందనే ఆలోచనలో ఉన్నాడని సినీ వర్గాలకు చెందిన వారు అభిప్రాయ పడుతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles