Pawan kalyan most desirable south indian actor

Pawan Kalyan in NY Times Top 5 List, Pawan Kalyan in New york Time, New York Times decides Pawan as 5th Most Desirable Actor in India, Powerstar Pawan Kalyan in new york times list

Recently the New York Times conducted an online survey on the top 10 most desirable actors in India and Pawan has got the 5th place in that. The sixth place has been given to Mahesh Babu. In south, Pawan stands as the number 1 actor.

పవన్ ఇక ఎవరికీ అందడు

Posted: 10/31/2013 07:39 PM IST
Pawan kalyan most desirable south indian actor

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్, ఇమేజ్ ఎంతుందో చెప్పాల్సిన అవసంర లేదు. మామూలు గానే జనాల్లో బోలెడంత ఇమేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కి ఇటీవల ఆయన నటించిన సినిమా ‘అత్తారింటికి దారేది ’ తో మన దగ్గరే కాకుండా, విదేశాల్లో తన స్టామినా ఏంటో నిరూపించి టాలీవుడ్ రికార్డులన్నింటిని తిరగరాసిన ఆయనకు మరో ఘనత దక్కింది.

ఈ ఘనతతో ఆయన ఎవరికీ అందనంత ఎత్తకు ఎదిగిపోయాడు. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఇండియన్ సినిమాకు సంబంధించి ’10 మోస్ట్ డిజైరబుల్ యాక్టర్స్ ఇన్ ఇండియా’ అనే అంశం పై జరిపిన ఆన్ లైన్ సర్వేలో పవన్ కళ్యాణ్ భారతదేశానికి సంబంధించిన వివిధ భాషలకు సంబంధించిన నటులలో పవన్ 5వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. దక్షిణాది నటుల్లో పవన్ కళ్యాణ్ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో పవన్ ఐదవ స్థానంలో ఉండగా, ప్రిన్స్ మహేశ్ బాబు కు 6 స్థానం దక్కింది.

ఈ జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ మొదటి స్థానం సొంతం చేసుకోగా, సల్మాన్ ఖాన్ రెండవ, అక్షయ్ కుమార్ మూడవ స్థానం, హృతిక్ రోషన్ నాలుగవ స్థానంలో దక్కించుకున్నారు.  తమిళ నటుడు విజయ్ 7వ, 8 వ స్థానం అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ 9వ, అజయ్ దేవగన్ 10వ స్థానంలో నిలిచారు. ఈ టాప్ టెన్ లో రజనీకాంత్, కమలహాసన్ లు లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

హిట్, ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా అభిమానుల హృదయాలను చూరగొన్న పవన్ రేంజ్ ఇలా పెరిగిపోతుంటే టాలీవుడ్ లో మిగతా హీరోలు ఈర్ష పడుతుంటే పవన్ ఫ్యాన్స్ మాత్రం తెగ ఆనంద పడిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles