Mahesh babu new look in one movie

Mahesh Babu new look, One movie firest look, Once movie stills leaked, Mahesh Babu one stills, Mahesh Babu one photos, Mahesh babu one, mahesh babu new look, Mahesh Babu

Lookie here its none other than actor Mahesh Babu rocking the nerdy look for his forthcoming One.

మహేష్ న్యూ లుక్ కిరాకు

Posted: 10/24/2013 12:59 PM IST
Mahesh babu new look in one movie

ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు లీకుల బాధ ఎక్కువైంది. పలు సినిమాకు సంబంధించిన స్టిల్స్, సాంగ్స్ ఇలా ఏదో ఒకటి అనధికారికంగా మార్కెట్లోకి వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇవి కాలవాలనే ఆ చిత్ర యూనిట్ ఎవరితోనైనా లీక్ చేయిస్తుందో లేక ఎవరైనా తస్కరించి మార్కెట్లోకి వదులు తున్నారో విడుదలకు ముందే మార్కెట్లోకి వచ్చి దర్శక నిర్మాతలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల ఏకంగా ల్యాబ్ నుండి ‘అత్తారింటికి దారేది ’ సినిమానే దొంగిలించి పైరసీ చేశారు.

ఈ ఉదంతం సినిమా పరిశ్రమనే ఓ కుదుపు కుదిపేసింది. దీన్ని మరచి పోకముందే సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమాకు సంబందించిన కొన్ని సాంగ్స్ స్టిల్స్ అంతర్జాలంలో హల్ చల్ చేయడంతో ఆ చిత్ర యూనిట్ ఖంగు తిన్నది. ఇందులో మహేష్ బాబు కొత్తగా కనిపిస్తుండంతో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

కానీ చిత్ర యూనిట్ వారు ఎవరు లీక్ చేశారో అని తలలు పట్టుకుంటున్నారు. బయటకు వచ్చినవి స్టిల్సే కదా.. అని చిత్రబృందం లైట్‌గా తీసుకోలేదు. వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీన్ని ఇలానే వదిలేస్తే రేపు సినిమా పరిస్థితి ఏంటి అని ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న 14 రీల్స్ సంస్థ ఇక పై స్ట్రిక్ట్ గా ఉండాలని డిసైడ్ అయిందట. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ‘ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేదు కదా ’..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles