Prabhas bahubali like another gladiator

Prabhas bahubali like another gladiator, gladiator, bahubali, rajamouli, big settings, siril, arena, prabhas, anushka

Prabhas bahubali like another gladiator, gladiator, bahubali, rajamouli, big settings, siril, arena, prabhas, anushka

గ్లాడియేటర్ స్థాయిలో ప్రభాస్ సినిమా

Posted: 10/08/2013 01:49 PM IST
Prabhas bahubali like another gladiator

టాలీవుడ్ లో దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకున్న ఎస్.ఎస్. రాజమౌళికి ఇంత వరకు టాలీవుడ్ లో ఒక్క ఓటమి కూడా ఎదురు కాలేదు. ఈయన చేసే ప్రతి సినిమాలో చాలా రోజుల సమయం తీసుకున్నా ఫలితాన్ని కూడా అలానే రాబట్టుకుంటాడు. ప్రతి సన్నివేశాన్ని శిల్పంలా చెక్కే జక్కన్న ప్రస్తుతం టాలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం అయిన ‘గ్లాడియేటర్ ’ రేంజ్ లో తీర్చి దిద్దుతున్నాడట. ఆ సినిమాలో లాగ హుందాతనంగా ఉండబోతున్నాయని, బ్బురపరిచే పాత్రధారుల ఆహార్యం, వీరత్వానికి ప్రతీకల్లా ఆయుధాల సొగసులు... మేలుజాతి గుర్రాల డెక్కల చప్పుళ్ళు, ప్రకృతి సైతం పరవశింపజేసే ఉద్యానవనాలు... ఇవన్నీ ‘బాహుబలి ’కి కళాత్మకశోభను సంతరింపజేస్తాయని చిత్ర యూనిట్ సభ్యలు అంటున్నారు.

ఇటివల శిరిల్ ఏర్పాటు చేసిన ‘ఎరీనా ’ సెట్‌లో రాజమౌళి దాదాపు రెండున్నర కోట్ల వ్యయంతో ప్రభాస్, అనుష్కల ‘నిశ్చితార్థం ’ దృశ్యాలను చిత్రీకరించారు. ఈ ‘బాహుబలి’ మూవీలో రానా కొడుకుగా ‘పంజా’  చిత్రం విలన్ అడవిశేషు నటిస్తున్నాడు. ఇద్దరివీ నెగెటివ్ రోల్స్ కావడం విశేషం.  ఈ చిత్రంలో మరో కథానాయికగా ప్రముఖ బాలీవుడ్ నాయికను ఎంపిక చేసినట్లు తెలిసింది. 80 నుంచి 100 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతోన్న ఈ చిత్రం పూర్తవడానికి సుమారు రెండేళ్లు పడుతుందని అంచనా. మరి జక్కన్న చెక్కుతున్న ఈ శిల్పం టాలీవుడ్ లో ఎన్ని రికార్డుల్ని క్రియేట్ చేస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles