Jr ntr ramayya vastavayya audio function canceled

Jr NTR Ramayya Vastavayya audio fuction, ramayya vastavayya audio function canceled, Ramayya Vastavayya Audio Release Date

Jr NTR Ramayya Vastavayya audio fuction, ramayya vastavayya audio function canceled, Ramayya Vastavayya Audio Release Date

ఎన్టీఆర్ హంగామా లేకుండా వస్తాడట

Posted: 09/19/2013 07:35 PM IST
Jr ntr ramayya vastavayya audio function canceled

నందమూరి అభిమానులకు ఇది ఒకరకమైన బ్యాడ్ న్యూస్. అదేంటిదోనని కంగారు పడిపోకండి. విషయం ఏంటంటే.. గత కొన్ని రోజుల నుండి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా ’ ఆడియో ను ఈ వారంలో కానీ, వచ్చే వారంలో కానీ విడుదల చేసి, అక్టోబర్ 10 తేదీన సినిమాను విడుదల చేయాలని సినిమా నిర్మాత భావిస్తున్నాడు. సినిమా విడుదల తేది మాట అటుంచితే... ఈ సినిమా ఆడియోను ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా కొంత మంది ప్రత్యేక అతిథుల మధ్య ఓ స్టార్ హోటల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. గతంలో బాద్‌షా ఆడియో లాంచింగ్ ఫంక్షన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో బాద్‌షా  నేర్పిన గుణపాఠం పుణ్యమా అని 'రామయ్య' దర్శకనిర్మాతలు జాగ్రత్త పడుతున్నారట. ఇటు జూనియర్ ఎన్టీయార్ కూడా మళ్లీ అటువంటి సీన్ పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నాడట. ఎన్టీఆర్ అభిమానుల కోసం ఆలోచిస్తుంటే...కొందరు మాత్రం ఆయన నిర్ణయం పై గుర్రుగా ఉన్నారు. చూద్దాం రామయ్యా ఆడియో ఉంటుందో లేదో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles