No case on hero ramcharan in hrc

Hero Ramcharan, No case in HRC, Taj Krishna Hotel, Ramcharan, security guards, Banjara hills

The dirty brawl between Ramcharan, his security guards and two software techies at Taj Krishna Hotel has took a serious turn when techies .

చరణ్ పై కేసు కొట్టేశారు

Posted: 09/19/2013 03:13 PM IST
No case on hero ramcharan in hrc

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, ప్రముఖ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ గత కొంత కాలం క్రితం బంజారాహిల్స్ లో తన కారుకు అడ్డంగా వచ్చిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను తన అనుచరులతో దాడి చేయించిన సంఘటనలో ఈయన పై హెచ్ఆర్సీలో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు నుండి ఆయన గట్టెక్కాడు. కాదు కాదు ఆయన  పై కేసు కొట్టేశారు. రామ్ చరణ్ దాడి చేయించిన వ్యవహారం పై ఒక న్యాయవాది ఫిర్యాదు మేరకు ఈ కేసును పరిశీలించిన మానవ హక్కుల సంఘం, ఆ సంఘటనకు సంబంధించి విచారణ చేపట్టింది.  చరణ్‌పై బాధితులు కేసు పెట్టలేదన్న విషయాన్ని స్వయంగా ఫిర్యాదుదారుడే హెచ్‌ఆర్‌సీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడంతో పాటు బాధితులుగా పేర్కొంటున్న ఇద్దరు వ్యక్తులని కూడా తమ ముందు హాజరుపర్చలేకపోయారని.. ఫలితంగా సరైన ఆధారాలు లేనందున ఈ పిటిషన్‌ని కొట్టేస్తున్నట్లుగా హెచ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. ఈ కేసును ఎత్తివేయడంతో చరణ్ ఊపిరి పీల్చుకున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles