Ram charan eyes on gang leader

Ram Charan Eyes On Gang leader, ram charan one more remake,

Ram Charan Eyes On Gang leader, ram charan one more remake,

చరణ్ మరో రీమేక్ లో

Posted: 09/06/2013 06:41 PM IST
Ram charan eyes on gang leader

రామ్ చరణ్ మనస్సు రీమేక్ చిత్రాల పైకి మళ్లినట్లుంది. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన ‘జంజీర్ ’ సినిమా ను బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఇప్పుడు టాలీవుడ్ లో తన తండ్రి ఒకప్పుడు నటించి సూపర్ హిట్ సాధించిన ‘గ్యాంగ్ లీడర్ ’ చిత్రాన్ని రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. గతంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. నేడు విడుదల అయి డివైడ్ టాక్ తెచ్చుకున్న జంజీర్ సినిమా సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... తెలుగులో మా డాడీ నటించిన ‘గ్యాంగ్ లీడర్  ’ చిత్రమంటే చాలా ఇష్టమని, దానిని రీమేక్ చేస్తానని, మంచి దర్శకుడు దొరికితే సెట్స్ పైకి ఎక్కించడానికి ఆలస్యం ఏమీ లేదని అన్నాడు. ‘వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏమీ అన్నట్లు ’ తన తండ్రి సినిమానే తను ఎప్పుడు కావాలంటే అప్పుడు రీమేక్ చేసుకోవచ్చు. మరి నేడు విడుదలైన జంజీర్ అంతగా అచ్చి రాలేదు మరి గ్యాంగ్ లీడర్ పరిస్థితి ఏమౌవుతుందో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles