టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ ప్లాపు చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ సినిమాలు గత కొంత కాలంగా బొల్తా పడుతున్నాయి. కారణం సరైన స్టోరీ, స్ర్కిప్టు లేకుండా ఏదో పని పూర్తి చేశామా నాలుగు డబ్బులు తీసుకున్నామా అట్లుగా వ్యవహరించడమే ఈయన్ని దెబ్బకొట్టింది. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ తో తీసిన ‘ఇద్దరమ్మాయిలతో ’ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో కాస్తంత వెనక్కి తగ్గిన పూరీ ఆచితూచి అడుగు వేసి తన పాత క్రేజ్ ని సంపాదించుకోవాలనే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లున్నాడు. అందులో భాగంగానే మళ్ళీ ఫాంలోకి వచ్చిన నితిన్ ని పెట్టి ఓ సినిమా తీయాలని డిసైడ్ అయ్యి పక్కా స్ట్రిప్టు రెడీ చేసుకొని ‘హార్ట్ ఎటాక్ ’ అనే టైటిల్ ని కూడా అనౌన్స్ చేశాడు.
ఇంత వరకు బాగానే ఉన్నా వీరిద్దరి కాంబినేషన్లో రూపొందబోయే సినిమా పూరి కెరియర్ కి మంచి పేరు తీసుకొచ్చిన ఇడియట్ సినిమాకు సీక్వెల్ గా తీయబోతున్నాడనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. తానే స్వయంగా రంగంలోకి దిగి తన సొంత బ్యానర్ వైష్ణో అకాడమీలో ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఇడియట్ కూడా వైష్ణో అకాడమీలో వచ్చి మంచి హిట్ సాధించింది. గతంలోనే చాలా సార్లు ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నాడని వార్తలు వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ యంగ్ హీరోతో దీన్ని పూర్తి చేయబోతున్నాడని అంటున్నారు. ఇక ఇప్పటికే కమీట్ అయిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ చిత్రం ‘అందగాడు ’ ని సైతం పక్కన పెట్టి దీన్ని పట్టాలెక్కిస్తున్నాడంటే పూరీ ఫూర్వ వైభవం కోసం ఎంత ప్రయత్నిస్తున్నాడో ఇట్టే అర్థం అవుతుంది. చూద్దాం నితిన్ - పూరి కాంబినేషన్ పూర్వ వైభవం తెస్తుందో ? లేక ప్రేక్షకులకు హార్ట్ ఎటాక్ తెస్తందో ?
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more