Jiah khan suicide note fake

Jiah Khan,Sooraj Pancholi,Jiah Khan suicide,Jiah Khan suicide note,Jiah Khan letters

The handwriting on the six-page long suicide note that was recovered from Jiah Khan` residence doesn’t seem to match that of the ones found at Sooraj Pancholi place.

సూసైడ్ నోట్ నకిలీదా ?

Posted: 06/18/2013 07:16 PM IST
Jiah khan suicide note fake

బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య పెద్ద సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈమె ముంబైలోని తన నివాసంలో సూసైడ్ చేసుకుంది. అయితే ఈమె ఆత్మహత్యకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు రోజుకు ఒక్కటి బయటికి వస్తున్నాయి. ఆమె మరణాంతరం ఆమె గదిలో దొరికిన సూసైడ్ ఇదే అంటూ జియా తల్లి విచారణ జరపాల్సిందిగా పోలీసులను కోరింది. దాని ఆధారంగా సూరజ్ పచోలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే అని, బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలి కారణంగా ఆమె గర్భం కూడా దాల్చిందని, అబార్షన్ చేసుకుందని, ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏర్పడ్డ వివాదాలు, మనస్పర్థలు ఆమెఆత్మహత్యకు దారి తీసాయని ఆమె తల్లి ఆరోపించింది. అయితే ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది.  జియా ఖాన్ సూసైడ్ లేఖకు, సూరజ్ గదిలో దొరికిన కొన్ని లెటర్స్ కి తేడా ఉందని ఆమె వాదిస్తోంది. చేతి రాతలో తేడా ఉన్నందు....ఈ విషయమై విచారణ జరుపాలని సూరజ్ తల్లి జరీనా వాహెబ్ వాదిస్తున్నారు. వాస్తావనికి జియా మరణించిన నాలుగైదు రోజుల వరకు ఎలాంటి లేఖ బయటకు రాలేదు. కానీ రెండు మూడు రోజుల తరువాత జియాతల్లి ఓ లేఖను పోలీసులకు అందించడం, ఇప్పుడు బయట పడిన లేఖలో చేతిరాత తేడాగా ఉండటం ఈ లెటర్స్ జియా కుటుంబ సభ్యులే స్రుష్టించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆ రెండు లేఖలను ఫోరెనిన్స్ ల్యాబ్  కి పంపించారు. మొత్తానికి ఈ కేసు మరో మలుపు తిరగడంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles