పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిన విషయమే. ఈయన గురించి ఏ చిన్న వార్త వచ్చినా ఫ్యాన్స్ తెగ హైరానా పడిపోతుంటారు. తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో నుండి ఈయన పై ఓ రూమర్ వినిపిస్తొంది దీన్ని విని ఆయన ఫ్యాన్స్ షాకయ్యారు. విషయం ఏంటయ్యా అంటే.. అసలే దాదాపు పది సంవత్సరాల తరువాత గబ్బర్ సింగ్ తో హిట్ బాట పట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈయన వరుస చిత్రాల ఫెయిల్యూర్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ దర్శక్వంలో ఓ సినిమాకు కమీట్ అయ్యాడనే వార్తలు విని తట్టుకోలేక పోతున్నారు. ఇప్పటికే కంత్రి,భిళ్లా,శక్తి, షాడో అంటూ బడా హీరోలతో సినిమాలు తీసి, నిర్మాతలను నిండా ముంచిన మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ ని ఓ కథ చెప్పి ఒప్పించాడని అంటున్నారు.
‘నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది ’ అనే టైపు లో పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తుంటాడు. సినిమా దర్శకుల జయాప జయాల గురించి పట్టించుకోకుండా ఇలాంటి దర్శకులకు అవకాశాలు ఇస్తుంటాడు. ఇప్పుడు కూడా పుసుక్కున ఆఫర్ ఇచ్చాడేమోనని ఆందోళన చెందుతున్నారు. అంతే కాకుండా మెహర్ రమేష్ కి మెగా ఫ్యామిలీతో ఉన్న సంబంధం కూడా ఓ కారణమే అంటే అంటున్నారు. పవన్ కళ్యాణ్...త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం అనంతరం గబ్బర్ సింగ్ 2 చేస్తాడని చెప్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది. కానీ ఆయన వీరాభిమానులు మాత్రం పవన్ అలాంటి పని చేయడని గట్టిగా నమ్ముతున్నారు. ఏదేమైనా పవన్స్ ఫ్యాన్స్ ని ఈ వార్త ఖంగారు పెడుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more